మంత్రి బొత్స సత్యనారాయణ
విజయనగరం,అక్టోబర్ 25 (ఆంధ్రపత్రిక): వచ్చే నెలలో బోగాపురం ఎయిర్‌పోర్ట్ , గిరిజన విశ్వవిద్యాలయానికి ప్రధానమంత్రి మోడీ చేతుల విూదుగా శంకుస్థాపన చేయబోతున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడిరచారు. అమరావతి రైతుల పాదయాత్రను టీడీపీ వెనుక నుంచి నడిపిస్తోందన్న విషయం బయట పడిరదన్నారు. ఇక పాదయాత్ర కొనసాగుతుందన్న నమ్మకం తమకు లేదన్నారు. ఆరు వందల మందితో వస్తున్న పాదయాత్రలో అరవై మంది కూడా రైతులు లేరన్న విషయం బయట పడిరదన్నారు. అందుకే టీడీపీ ముసుగులో ఉన్న అమరావతి రైతుల పాదయాత్రను ఆపేశారని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఆకాంక్ష విశాఖ పరిపాలనా రాజధాని ఇక సా కారం అయినట్టేనన్నారు. విశాఖ కేంద్రంగా పరిపాలనా రాజధానికి ఉన్న అడ్డంకులు త్వరలోనే పరిష్కరమవుతాయన్నారు