ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ
అమరావతి,అక్టోబర్ 19 (ఆంధ్రపత్రిక): రాజకీయ వ్యవస్థకు పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తి ఉండటం దురదృష్టకరమని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..నిన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు.‘’రాజకీయాల్లో విమర్శలు రావడం సహజం. విమర్శలు వచ్చినప్పుడు విమర్శలుగానే సమాధానం చెప్పాలి. నోరు ఉందని ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. తెదేపాకి కొమ్ము కాస్తున్నాం అంటున్నారని బాధపడుతున్నారు.. పవన్ ప్యాకేజీ స్టార్ కాదని నిరూపించుకోవాలి. పవన్ కల్యాణ్‌కే కాదు.. అందరికీ చెప్పులు ఉంటాయి. నిన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిశారు.. వైకాపా చేస్తున్న ఆరోపణలు నిజమయ్యాయి కదా. జనసేన రాజకీయ పార్టీ కాదు.. సెలబ్రిటీ పార్టీ. జనసేన కార్యకర్తలు మంత్రులపై దాడి చేస్తే చర్యలు తీసుకోకూడదా? విశాఖలో పవన్ సభ రద్దు చేసుకుంటే అది మా తప్పా? ఊరేగింపు వద్దు.. సభ నిర్వహించుకోమని పోలీసులు చెప్పారు. పవన్ వచ్చిన రోజు నేనే ట్రాఫిక్‌లో గంటన్నర సేపు రోడ్డుపై ఆగిపోయాను.ర్యాలీకి పోలీసుల అనుమతి తీసుకుని ఉంటే పోలీసులే వేరే రూట్ మ్యాప్ ఇచ్చేవారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాం అంటే ఎవరూ ఊరుకోరు. విశాఖ ఉక్కును ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు.. పవన్ చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ మాటలు చూస్తుంటే రక్తం మరుగుతోంది… మాకు సంస్కారం ఉంది కాబట్టి మౌనంగా ఉన్నాం. చిరంజీవి కూడా రాజకీయాల్లోకి వచ్చారు ఎప్పుడైనా ఇలా మాట్లాడారా? చంద్రబాబును చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుంది. చంద్రబాబు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి చూస్తే ఇప్పటి వరకు ఆయన మాట మీద నిల్చున్నారా? అవినీతి, దోపిడీకి చిహ్నంగా ఉన్నారు. నిన్న రాజమహేంద్రవరంలో అమరావతి మహాపాదయాత్ర సందర్భంగా జరిగిన ఘటనలో వైకాపా ఎంపీ, రైతులను ఇద్దరినీ సమర్థించను. ఎక్కడి నుంచో వచ్చి మీసాలు తిప్పి, వాటర్ బాటిల్ విసిరేస్తారా? అది తెదేపా పాదయాత్ర, చేస్తున్నవారంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులు’’ అని బొత్స సత్యనారాయణ విమర్శించా