చాలా మంది ఏదో ఒక సందర్భంలో మాకు ఉన్నపళంగా డబ్బుల మూట దొరకితే బాగుండని, ఎవరైనా తమ బ్యాంక్ అకౌంట్లో భారీగా డబ్బులు వేస్తే బాగుండని భావిస్తుంటారు. అది జరగదని తెలిసినా.. లైఫ్లో తాము ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో మనసులో అప్పుడప్పులు అలా కోరుకుంటుంటారు. కానీ, ఓ కూలీ విషయంలో ఇది నిజమైంది. ఆ కూలీ బ్యాంక్ ఖాతాలో భారీగా డబ్బు జమ అయ్యింది. ఒకటి కాదు.. రెండు కాదు..
చాలా మంది ఏదో ఒక సందర్భంలో మాకు ఉన్నపళంగా డబ్బుల మూట దొరకితే బాగుండని, ఎవరైనా తమ బ్యాంక్ అకౌంట్లో భారీగా డబ్బులు వేస్తే బాగుండని భావిస్తుంటారు. అది జరగదని తెలిసినా.. లైఫ్లో తాము ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో మనసులో అప్పుడప్పులు అలా కోరుకుంటుంటారు. కానీ, ఓ కూలీ విషయంలో ఇది నిజమైంది. ఆ కూలీ బ్యాంక్ ఖాతాలో భారీగా డబ్బు జమ అయ్యింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ. 200 కోట్లు అతని అకౌంట్లో జమ అయ్యాయి. ‘మీ అకౌంట్లో రూ. 200 కోట్లు జమ అయ్యాయి’ అంటూ తన మొబల్కు వచ్చిన మెసేజ్ చూసి అతను షాక్ అయ్యాడు. వెంటనే విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశాడు. ఇంత డబ్బు ఎవరు, ఎందుకు జమ చేసి ఉంటారంటూ కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యపోయారు.
హర్యానాలోని దాద్రీ జిల్లాలోని బెర్లా గ్రామానికి చెందిన కూలీ విక్రమ్ బ్యాంకు ఖాతాలో రూ. 200 కోట్లు జమ అవడంతో షాక్ అయ్యారు. తన బ్యాంకు ఖాతాలోకి డబ్బులు వచ్చినట్లు మెసేజ్ రావడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఈ విషయాన్ని విక్రమ్, అతని బంధువు ప్రదీప్ గ్రామస్తుల ముందు చెప్పడంతో ఆ ప్రాంతమంతా చర్చనీయాంశంగా మారింది. కార్మికులు విక్రమ్, అతని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందిచంగా.. వారు వచ్చి విచారణ జరిపారు. డబ్బు యెస్ బ్యాంక్ అకౌంట్లో ఈ రూ. 200 కోట్లు జమ అయినట్లు తెలిపారు. అయితే, ఈ డబ్బును ఫ్రీజ్ చేసినట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు.
రెండు నెలల క్రితం కూలి పనికి వెళ్లిన విక్రమ్..
ఇంత మొత్తం ఎవరు ఎందుకు జమ చేశారో తెలియడం లేదని విక్రమ్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. విశేషమేమిటంటే.. అతని బ్యాంక్ ఖాతా ద్వారా ఇప్పటి వరకు జరిపిన లావాదేవీల సంఖ్య కేవలం 9 మాత్రమే. అయితే, బెర్ల వాసి అయిన విక్రమ్ ఎనిమిదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. రెండు నెలల క్రితం ఉద్యోగం కోసం పటౌడీ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఎక్స్ ప్రెస్-20 అనే కంపెనీలో కూలీగా చేరాడు. విక్రమ్ సోదరుడు ప్రదీప్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖాతా తెరిచేందుకు విక్రమ్ నుంచి పత్రాలు తీసుకున్నారని, ఆ తర్వాత అకౌంట్ క్యాన్సిల్ అయిందని చెప్పి ఉద్యోగం నుంచి తొలగించారన్నారు.
రూ.200 కోట్ల లావాదేవీ..
విక్రమ్ దాదాపు 17 రోజుల పాటు కూలి పని చేశాడు. ఈ వ్యవహారంపై దృష్టి పెట్టిన పోలీసులు.. విక్రమ్ ఖాతాలో రూ.200 కోట్ల లావాదేవీ జరిగినట్లు బ్యాంకులో ఆరా తీశారు. అసలు ఎవరు వేశారు? ఈ లావాదేవీ వెనుక కథ ఏంటా? కూపీ లాగే ప్రయత్నం చేశారు. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ ఏరియా పోలీస్ స్టేషన్కి ఇందుకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదట. తమకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదని వారు చెబుతున్నారు. ఇదే విషయమై డీఎస్పీ అశోక్ కుమార్ను మీడియా సంప్రదించేందుకు ప్రయత్నించగా..ఆయన రెస్పాండ్స్ అవడం లేదంటున్నారు స్థానిక మీడియా ప్రతినిథులు. డబ్బు గురించి ఏమీ చెప్పలేమంటూ కిందిస్థాయి ఉద్యోగి ద్వారా సమాచారం పంపించారట.