అక్టోబర్ 22 (ఆంధ్రపత్రిక): చియాన్ విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది ’కోబ్రా’తో మంచి శుభారంభం దక్కపోయినా.. ఇటీవలే విడుదలైన ’పొన్నియన్ సెల్వన్’తో మంచి విజయం సాధించాడు. లేజండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్ 30న విడుదలైన భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈయన పా.రంజిత్ దర్శకత్వంలో ’చియాన్61’ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
ఈ సినిమాకు సంబంధించిన టైటిల్/ ఫస్ట్‌లుక్ పోస్టర్ దీపావళికి రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే మేకర్స్ నుండి అఫిషీయల్ ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 19 శతాబ్దంలోని కోలార్ గోల్డ్ ఫీల్స్ నేపథ్యంలో తెరకెక్కతుందట. అంతేకాకుండా ఈ చిత్రాన్ని 3డీలో రూపొందిస్తున్నారట. తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో షూటింగ్ జరిపి, మిగిలిన భాషల్లో ఈ సినిమాను డబ్బింగ్ చేస్తారట. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!