రెండవ రోజు సోమవారం అమ్మవారు శ్రీ గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పంచ ముఖాలతో ఉండే గాయత్రీ దేవి స్వరూపానికి ఎంతో విశిష్టత ఉంది. రెండో రోజూ తెల్లవారుజాము నుండే అమ్మవారు గాయత్రి దేవి గా దర్శనం ఇవ్వనున్నారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్తా విద్రుమ హేమనీల దవళవర్ణాలతో గాయత్రీ దేవి ప్రకాశిస్తుంది.. పంచ ముఖాలతో..
ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండవ రోజు సోమవారం అమ్మవారు శ్రీ గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పంచ ముఖాలతో ఉండే గాయత్రీ దేవి స్వరూపానికి ఎంతో విశిష్టత ఉంది. రెండో రోజూ తెల్లవారుజాము నుండే అమ్మవారు గాయత్రి దేవి గా దర్శనం ఇవ్వనున్నారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్తా విద్రుమ హేమనీల దవళవర్ణాలతో గాయత్రీ దేవి ప్రకాశిస్తుంది.. పంచ ముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి శిరస్సు యందు బ్రహ్మ, హ్రుదయమందు విష్ణువు, శిఖ యందు రుద్రుడు నివసిస్తుండగా త్రికూర్త్యాంశంగా గాయత్రీ దేవి వెలుగొందుచున్న రూపాన్ని చూసి భక్తులు తరిస్తారు.
గాయత్రీ దేవిని దర్శించుకుంటే సకల మంత్ర సిద్ధి ఫలం పొందుతారని విశ్వాసం. సంధ్య వందన గాయత్రి దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నా అమ్మవారిని దర్శించుకోవడానికి భారీగా తరలి వస్తున్నారు భక్తులు. అన్ని మంత్రాలకు మూలశక్తి అయిన ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశించే ఐదు ముఖాలతో పాటు అమ్మవారు ఇవాళ మన శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి ఉంటుంది.
గాయత్రీ ఉపాసన ద్వారా బుద్ధి వికసిస్తుంది అని పురాణ ప్రీతి.. అంతేకాకుండా ప్రాతస్సంధ్యలో గాయత్రిగా, మధ్యాహ్న సంధ్యలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగా అమ్మలుకన్న అమ్మ దుర్గమ్మను ఇవాళ గయత్రిగా ధ్యానిస్తారు. గాయత్రి రూపంలో వున్న అమ్మవారిని ఉపాసన ద్వారా అనంతమైన మంత్రశక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.. గాయత్రి అలంకారంలో దర్శనమిచ్చినప్పుడు అమ్మవారి గాయత్రీ మంత్రాన్ని వీలైనన్నిసార్లు చదువుతుంటారు.. ఇవాళ రాత్రి 12 గంటల వరకు అమ్మవారు గాయత్రి అలంకారంలోనే భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు..
దర్శనం కోసం క్యూలైన్లు..
వినాయకుడి గుడినుండి ప్రారంభమైన 3 క్యూలైన్ల ద్వారా భక్తులు దర్శనం చేసుకున్నారు… ఉచిత దర్శనం , 100 రూపాయల దర్శనం, 3 వందల రూపాయల దర్శనం కోసం క్యూలైన్లు ఏర్పాటు చేసారు.. విఐపిల కోసం 500 రూపాయల టికెట్ ను ఏర్పాటు చేసారు.. నగరంలో ఐదు ప్రాంతాల నుండి ప్రత్యేక వాహాణాల ద్వారా విఐపిలను తీసుకువచ్చి దర్శనం చేయించి తిరిగి వదిలిపెట్టారు… ఉత్సవాల సందర్బంగా ఎలాంటి అవంచానీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ పోలీసు బందో బస్తు ఏర్పాటు చేసారు..
ఘాట్ రోడ్ మార్గంలో క్యూలైన్ల ద్వారా దర్శనం చేసుకున్న భక్తులు మల్లిఖార్జున మండపం, శివాలయం మీదుగా దిగువ కు వెళ్లేలా మార్గం ఏర్పాటు చేసారు.. ప్రసాదాల కౌంటర్ల వద్ద రద్దీ లేకుండా చర్యలు చేపట్టారు… దసరా ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని భక్తులు అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన దర్శన సమయం, విఐపిల హడావిడిపై మండిపడ్డారు… రెవిన్యూ, ఆలయ సిబ్బందితో పాటు ఇతర డిపార్ట్ెంట్ లు నేరుగా దర్శనాలకు వెళ్ళటంతో 500 రూపాయల టికెట్ ల భక్తులకు వెయిటింగ్ తప్పలేదు…ఏదైన కుడా అర్ధరాత్రి 12 గంటల వరకు కొండపై భక్తుల మొదటి రోజు అలానే కొనసాగింది..