ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఏర్పాట్లను విజయవంతం చేసేందుకు ముమ్మర కసరత్తు మొదలుపెట్టారు. ప్రతి ఏడాది దసరా సమయంలోనే భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు.. దసరా పండుగ పూర్తయిన రెండు రోజుల తరువాత భవాని దీక్ష దారుల రద్దీ కొనసాగుతుంది.. అయితే దసరా ముగిసిన వెంటనే కార్తీక మాసంలో దీక్షల స్వీకరణ జరుగుతూ ఉండటంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
దసరా ఉత్సవాలు ముగిసి నెల రోజులు కూడా పూర్తవకుండానే మరో ఆధ్యాత్మిక వైభవానికి ఇంద్రకీలాద్రి వేదిక అయ్యింది. ప్రతి ఏడాది దసరా ఉత్సవాలు ముగిసిన తరువాత వచ్చే కార్తీక మాసంలో జరిగే భవాని దీక్షల స్వీకరణతో ఈనెల 27వ తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా దీక్షల స్వీకరణ దీక్షల విరమణకు సంబంధించిన షెడ్యూల్ ను ఆలయ అధికారులు ప్రకటించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా భక్తులు దీక్ష దారులు అధికంగా వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అధికంగా వచ్చే భక్తులు దీక్షలో పాల్గొనే అవకాశం ఉందని, అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు, సిబ్బంది.
ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఏర్పాట్లను విజయవంతం చేసేందుకు ముమ్మర కసరత్తు మొదలుపెట్టారు. ప్రతి ఏడాది దసరా సమయంలోనే భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు.. దసరా పండుగ పూర్తయిన రెండు రోజుల తరువాత భవాని దీక్ష దారుల రద్దీ కొనసాగుతుంది.. అయితే దసరా ముగిసిన వెంటనే కార్తీక మాసంలో దీక్షల స్వీకరణ జరుగుతూ ఉండటంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
కార్తీక మాసంలో భవాని దీక్షలు అత్యంత వైభవోపేతంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఏడాది కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అందులో భాగంగానే ఈనెల 23 వ తేదీ నుంచి 27 వ తేదీ వరకు మండల దీక్షలు ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 13 నుంచి 17 వరకు అర్ధ మండల దీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇక డిసెంబర్ 26 వ తేదీన కలశజ్యోతి మహోత్సవం జరగనుండగా, జనవరి ౩ నుంచి భవాని దీక్షలా విరమణలు ప్రారంభం కానున్నాయి. ఇక జనవరి 7వ తేదీన ఉదయం పూర్ణాహుతితో దీక్షల విరమణ పూర్తి కానుంది.