కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, డైరెక్టర్ వెంకట్ ప్రభు కాంబోలో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతోంది. భారీ అంచన మధ్య ఈ సినిమాకు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్స్ ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాలో విజయ్ ప్రయోగం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో విజయ్ ఏకంగా 25 ఏళ్ల యువకుడిలా కనిపించబోతున్నట్లు టాక్. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని ఈ సినిమాకు పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఈ GOAT సినిమా కోసం డైరెక్టర్ హాలీవుడ్ క్రూ టీమ్‌ని రంగంలోకి దించబోతున్నారు.
ఈ చిత్రానికి అవతార్, అవెంజర్స్ లాంటి హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్‌కి విజువల్ ఎఫెక్ట్స్ అందించిన సాంకేతిక నిపుణులు పని చేయనున్నారు. ఈ విషయాన్ని క్రియేటివ్ ప్రొడ్యూషర్ అర్చనా కళ్పతి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో ఈ సినిమాలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నట్లు అర్థం అవుతోంది.
ఈ సినిమాలో విజయ్ కోసం ప్రత్యేకంగా డీ-ఏజింగ్ టెక్నాలిజీని వాడి 25 ఏళ్ల కుర్రాడిగా చూపించనున్నారు. దీనికోసమే వారిని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. విజయ్ను పాతికేళ్లు కుర్రాడిలా చూపించడం కోసం అమెరికాలోని లాస్ ఏంజెలిస్ లోని స్టూడియోలో నిపుణులు విజువల్ ఎఫెక్ట్ పనులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ దీన్ని నిర్మిస్తుంది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ముందు ఈ సినిమా వస్తుండడంతో అందిరిపైనా దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే ఈ సినిమాలో విజయ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నట్లు పోస్టర్ చూస్తే అర్థం అవుతోంది. హీరో విజయ్ ను యంగ్ రోల్‌ను టెక్నీషియన్‌ను ఎలా చూపిస్తూరో వేచిచూడాల్సిందే.