నవంబర్ 25 (ఆంధ్రపత్రిక): నటసింహ నందమూరి బాలకృష్ణ మరియు క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటటైనర్ వీరసింహా రెడ్డి సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ’వీరసింహా రెడ్డి’ ఫస్ట్ లుక్`టైటిల్ టీజర్ మరియు ఇతర ప్రత్యేక పోస్టర్లు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఫస్ట్ సింగిల్ ’జై బాలయ్య’ మాస్ ఆంథమ్‌ని రిలీజ్ చేయడంతో మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించారు మేకర్స్. ’రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి పేరు.. నిన్ను తలచుకున్న వారు.. లేచి నిల్చొని మొక్కుతారు.. అచ్చ తెలుగు పౌరషాల రూపం నువ్వయ్యా.. ఈ పాటకు శంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు. జన సమూహాల మధ్య దేవాలయాల పరిశరాలలో ఈ పాటని చిత్రీకరించారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేశారు. నవీన్ నూలి ఎడిటింగ్ విభాగం చూసుకున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని ` వై రవిశంకర్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చందు రావిపాటి దీనికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. ఇందులో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది. లాల్`నవీన్ చంద్ర`రాజీవ్ కనకాల ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. చంద్రిక రవి స్పెషల్ సాంగ్ చేసింది. సంక్రాంతి స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకురాబోతున్న ’వీరసింహా రెడ్డి’ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!