- జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ నినాదాలతో మార్మోగిన హిమగిరులు
- ఇది నాల్గవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- మోదీకి అత్యంత ఆత్మీయంగా స్వాగతం పలికిన ప్రజలు
- చూడు, చూడు ఎవరొచ్చారో, పులి వచ్చింది, పులి వచ్చింది అంటూ నినాదాలు
- ఊన జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణానికి మోదీ శంకుస్థాపన
- చంబ జిల్లాలో రెండు జలవిద్యుదుత్పత్తి కేంద్రాలకు శంకుస్థాపన
న్యూఢల్లీి,అక్టోబర్13 అక్టోబర్ 13 (ఆంధ్రపత్రిక): దేశంలో నాల్గవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. త్వరలో హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలకు వెళ్లనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించనున్నారు. హిమగిరుల్లో పరుగులు తీసిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. జెండా ఊపి ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా రైల్వే స్టేషన్ నుండి నాల్గవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు హిమాచల్ ప్రదేశ్‌లోని అంబ్ అందౌరా నుండి ఢల్లీి వరకు నడుస్తుంది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి నడిచే మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇదే కావడం విశేషం. ప్రతి బుధవారం మినహా.. ఈ రైలు వారంలో మిగిలిన అన్ని రోజులలో నడుస్తుంది. ఈ రైలు హిమాచల్ నుండి ఢల్లీికి ప్రయాణించడానికి కేవలం ఐదు గంటల సమయం పడుతుంది. అదే సమయంలో దీని ద్వారా, ఢల్లీి, చండీగఢ్ మధ్య మూడు గంటల్లో ప్రయాణం చేయవచ్చు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి హిమాచల్ ప్రదేశ్‌లోని ఉన ప్రజలు అత్యంత ఆత్మీయంగా స్వాగతం పలికారు. చూడు, చూడు ఎవరొచ్చారో, పులి వచ్చింది, పులి వచ్చింది అంటూ నినాదాలు చేశారు. హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన ఇక్కడ గురువారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఉనలో బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్తూ మోదీ ప్రజలకు అభివాదం చేశారు. ఆ సమయంలో ప్రజలు పెద్ద ఎత్తున మోదీ, మోదీ అంటూ నినాదాలు చేశారు. దీనిని ప్రారంభించిన మోదీ కాసేపు దీనిలో ప్రయాణం చేశారు. ఆయనకు భద్రత కల్పించేందుకు భద్రతా సిబ్బంది చాలా శ్రమించవలసి వచ్చింది. అలాగే ఊన జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేశారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని జాతికి అంకితం చేశారు. చంబ జిల్లాలో రెండు జలవిద్యుదుత్పత్తి కేంద్రాలకు శంకుస్థాపన చేస్తారు. ఇదిలావుండగా, మోదీ గురువారం ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అంతకు ముందు ప్రారంభమైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళ కన్నా ఆధునికమైనదని అధికారులు తెలిపారు. అతి తక్కువ సమయంలోనే గరిష్ఠ వేగాన్ని అందుకుంటుందని చెప్పారు.