పాశ్చాత్య దేశాల్లో ప్రేమికులు దినోత్సవానికి ప్రాధాన్యం
న్యూఢల్లీి,ఫిబ్రవరి 13 (ఆంధ్రపత్రిక) : ప్రేమ అనేది అద్భుతమైన భావన.. ప్రతీ ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ప్రేమలో పడే ఉంటారు. ఇది ఎదుటివారికి చెప్పాలని ఆరాటపడతారు. అందుకోసం ఓ మంచి ముహూర్తం కూడా చూస్తారు. అలాంటి వారందరికీ ఈ వాలెంటైన్స్ డే, వీక్ చాలా బాగా కలిసొస్తాయి.. ప్రేమికుల దినోత్సవానికి వారం రోజు ముందునుంచే ఒక్కోరోజుకి ఒక్కో స్పెషాలిటీ ఉంది.. చివరి రోజు అయిన వాలెంటైన్స్ డే గురించి చాలా మంది ఎదురుచూస్తారు. ఆరోజే అసలు రోజు అన్న మాట.. అయితే.. ప్రేమ అనేది ఫలానా రోజులో ఫలానా టైమ్‌కే పుట్టాలని లేదు. ఏ రోజు అయినా పుట్టొచ్చు.. ఏ సమయంలో నైనా పుట్టొచ్చు.. అలాంటి ప్రేమని వ్యక్త పరచడానికి ప్రత్యేకంగా రోజు కావాలా అంటే అది అవసరం లేదు.. ఎప్పుడైనా వ్యక్తపరచొచ్చు. వాలెంటైన్ అనే ఒక ప్రవక్త. ప్రేమికుల రోజు పుట్టడానికి ఆద్యుడు. రోమ్ దేశంలో జీవించిన వాలెంటైన్ యువతకు ప్రేమ సందేశాలు ఇవ్వడం, ప్రేమ వివాహాలను ప్రోత్స హించడం చేసేవాడు. అదే సమయంలో రోమ్ను పాలిస్తున్న చక్రవర్తి క్లాడియస్ కుమార్తె కూడా వాలెంటైన్
అభిమానిగా మారడంతో చక్రవర్తికి భయం పట్టుకుంది. దీంతో యువతకు ప్రేమ సందేశాలిచ్చి తప్పుడు దోవ చూపిస్తున్నాడన్న నెపంతో వాలెంటైన్‌కు మరణశిక్ష విధించి ఫిబ్రవరి 14న ఉరి తీయించాడు. ఈ ఘటన జరిగిన రెండు దశాబ్దాల తర్వాత అప్పటి పోప్ గెలాసియన్స్ వాలెంటైన్ మరణించిన రోజును ప్రేమికుల రోజుగా ప్రకటించారు. అప్పటినుంచి ఖండాంతరాలను దాటుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు పండుగగా జరుపుకునేలా ప్రేమికుల దినోత్సవం విస్తరించింది. ఏటా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమికులు తమకిష్టమైన కానుకలు ఇచ్చు పుచ్చుకుంటారు. భారతదేశంలో ప్రేమికుల రోజు దినోత్సవం జరుపుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కానీ విదేశీ సంస్కృతి కావడంతో చాలామంది దీనిని వ్యతిరేకిస్తున్నారు. విదేశాలలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సెలవు ఇచ్చే విధానం ఉంది. మన
దేశంలో లేదు. జర్మనీలో ప్రేమికుల రోజున పంది బొమ్మ ఉన్న గ్రీటింగ్ కార్డును ఇచ్చిపుచ్చుకోవడం శుభసూచకంగా భావిస్తారు. వాలెంటైన్ డేకు పంది బొమ్మలకు జర్మనీలో డిమాండ్ ఉంటుంది. అర్జెంటీనాలో ఇక్కడ విభిన్నంగా జూలై 13 నుంచి 20వ తేదీ వరకూ వారం పాటు వాలెంటైన్ వీక్‌గా జరుపుకొంటారు. కొరియాలో ఏప్రిల్ 14ను వైట్ డేగా భావిస్తూ ప్రేమికులు దినోత్సవం ఉత్సాహంగా తీసుకుంటారు. ప్రేమికుల రోజును వ్యతిరేకించే వాళ్లలో దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తరాదిలో ఎక్కువని ఓ సర్వేలో వెల్లడైంది. ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ భారతదేశంలో ప్రేమికుల రోజుకు ప్రత్యామ్నాయం గా ఫిబ్రవరి 14న వివిధ దినోత్సవాలు నిర్వహిస్తున్నారు. 2012లో ఉత్తర్ ప్రదేశ్ సీఎంగా అఖిలేశ్ యాదవ్ ఉన్నప్పుడు ఫిబ్రవరి 14న మాతృ`పితృ పూజ నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.అప్పటి నుంచి ప్రతి ఏడాది యూపీ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలో శివసేన ఫిబ్రవరి 14న ’బ్లాక్ డే’గా నిర్వహిస్తోంది. దేశానికి స్వాతంత్యర్ర సిద్ధించడంలో అహర్నిశలు శ్రమించిన భగత్ సింగ్‌తో పాటు మరో ఇద్దరికి ఈ రోజునే న్యాయస్థానం మరణశిక్ష విధిస్తున్నట్టు తీర్పు వెలువ రించింది. దీంతో స్వాతంత్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన, ఇప్పటికీ ప్రతి భారతీయుడి గుండెల్లో నిలిచిపోయిన భగత్ సింగ్‌కు శిక్ష పడిన ఆరోజును ఆనందంతో కాకుండా వారికి నివాళిగా జరుపు కోవాలనేది శివసేన అభిమతం. మరోవైపు ఏటా బజరంగ్ దళ్ తదితరహిందూసంస్థలు ప్రేమికుల దినాన్ని నిషేధించాయి.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!