వైకుంఠ ఏకాదశి కోసం తిరుమల శ్రీవారి భక్తులు ఏడాదంతా ఎదురు చూస్తారు. ఆ రోజు వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పెద్దఎత్తున తరలి వెళతారు. ఇక కలియుగ దైవం.. శ్రీ వేంకటేశ్వరుడ్ని వైకుంఠ ఏకాదశి నాడు.. ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవడానికి లక్షలాదిమంది భక్తులు తిరుమలకు తరలి వెళతారు.
వైకుంఠ ఏకాదశి కోసం తిరుమల శ్రీవారి భక్తులు ఏడాదంతా ఎదురు చూస్తారు. ఆ రోజు వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పెద్దఎత్తున తరలి వెళతారు. ఇక కలియుగ దైవం.. శ్రీ వేంకటేశ్వరుడ్ని వైకుంఠ ఏకాదశి నాడు.. ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవడానికి లక్షలాదిమంది భక్తులు తిరుమలకు తరలి వెళతారు. ఈ నెల 23వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినం రానుంది. వైకుంఠ ఏకాదశి నాడు వీవీఐపీల నుంచి సామాన్యుల వరకు శ్రీవారి దర్శనం కోసం క్యూకడతారు. అయితే ఒక్కరోజులో అందరికీ దర్శనం కల్పించడం సాధ్యం అయ్యే పనికాదు కాబట్టి.. ఈ నెల 25 నుంచి జనవరి 1 వ తేదీ వరకు పది రోజుల పాటు తిరుమల శ్రీవారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి టీటీడీ వీలు కల్పిస్తోంది.
వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను ఈనెల 10వ తేదీ నుంచి భక్తులకు అందుబాటులో ఉంచనున్నట్లు టిటిడి ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. 10 రోజులకు కలిపి రెండు లక్షల 25 వేల టోకెన్లను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఇక డిసెంబర్ 22న తిరుపతిలోని 9 కేంద్రాల్లో4.25 లక్షల టైమ్ స్లాట్ సర్వదర్శన టోకెన్లను విడుదల చేస్తున్నట్టు చెప్పారు. అదే విధంగా రోజుకు 2000 చొప్పున శ్రీవాణి టికెట్లను కేటాయిస్తామన్నారు.
వైకుంఠ ద్వార దర్శనంతో సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటోంది. ఆ పది రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు, ఇతర ప్రివిలేజ్ దర్శనాలను కూడా రద్దు చేస్తున్నారు.