మచిలీపట్నం సెప్టెంబర్ 16 ఆంధ్ర పత్రిక.:
జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక ఇటీవల పనిచేస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు వారి వారి అర్హతను బట్టి కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. జిల్లా పరిషత్ కార్యాలయం మండల పరిషత్ కార్యాలయం మరియు ఇంజనీరింగ్ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్ ఐదు పోస్టులు, టైపిస్టు ఏడు పోస్టులు, ఆఫీసు సబార్డినేట్లను రెండు పోస్టులు ఆయా కుటుంబ సభ్యులలో అర్హత గలవారికి అందించారు. లైబ్రరీ అసిస్టెంట్ గా పని చేస్తున్న ఇద్దరికీ జూనియర్ అసిస్టెంట్లుగా ఉన్నతులు కల్పిస్తూ పత్రాలు అందించారు. మొత్తం 16 మందికి నియామక పత్రాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వీర్ల జ్యోతి బసు,కార్య నిర్వాహణాధికారి జి. శ్రీనివాసరావు కార్యాలయ సిబ్బంది పాల్గొని అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందజేశారు.