(న్యూఢిల్లీ నుంచి)
భారత ఆర్మీ కొత్త అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ నియమితులయ్యారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ సి. పాండే ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో, ఆయన స్థానంలో ఉపేంద్ర
ద్వివేదీని నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. లెఫ్టినెంట్ జనరల్ ద్వివేదీ ప్రస్తుతం ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్‌గా ఉన్నారు.
ద్వివేదీ 1964లో జన్మించారు. 1984లో జమ్మూకశ్మీర్ రైఫిల్స్‌లో చేరారు. ఆర్మీలో 40 ఏళ్ల సర్వీస్ ఉన్న ఆయన ఆర్మీలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. కశ్మీర్ లోయ, రాజస్థాన్ సెక్టార్లో పనిచేశారు.
సెక్టార్ కమాండర్, అస్సాం రైఫిల్స్ ఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో ఆయన డైరెక్టర్ జనరల్ ఇన్ఫాంట్రీ, నార్తర్న్ కమాండ్
జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌గా కూడా వ్యవహరించారు.
రేవా సైనిక్ స్కూల్ పాఠశాలలో విద్యనభ్యసించిన ఆయన.. నేషనల్ డిఫెన్స్ కాలేజీ, యూఎస్ ఆర్మీ వార్ కళాశాలలో చదువుకున్నారు. డిఫెన్స్, మేనేజ్మెంట్ స్టడీస్ లో ఎంఫిల్ చేశారు. స్ట్రాటజిక్ స్టడీస్, మిలిటరీ
స్టడీస్‌లో రెండు మాస్టర్ డిగ్రీ పట్టాలను పొందారు. దేశానికి ఆయన సేవలకు గాను పరమ విశిష్ట సేవా, అతి విశిష్ట సేవా పతకాలను కూడా పొందారు. ఇక ప్రస్తుత ఆర్మీ అధిపతి మనోజ్ పాండే 2022 ఏప్రిల్ 30న
ఆర్మీ అధిపతిగా విధుల్లో చేరారు. మే నెలాఖరునే ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఆయన పదవీ కాలాన్ని కేంద్రం మరో నెల రోజుల పాటు పొడిగించింది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!