డిసెంబర్ 06 (ఆంధ్రపత్రిక): దర్శక ధీరుడు రాజమౌళి ఇటీవలే ఉత్తమ దర్శకుడిగా ది న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డును అందుకున్నాడు. తాజాగా ఈ సినిమా మరో అరుదైన అవార్డును గెలుచుకుంది. హాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా భావించే స్పాటిలైట్ అవార్డును ఆర్ఆర్ఆర్ బృందం గెలుచుకుంది. దీనితో పాటుగా అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ ఈ ఏడాదికిగాను ఉత్తమ అంతర్జాతీయ సినిమా అవార్డుకు ఆర్ఆర్ఆర్ మూవీని ఎంపిక చేసింది. ఇలా వరుసగా ఆర్ఆర్ఆర్కు హాలీవుడ్ నుండి అవార్డులు రావడంతో టాలీవుడ్ ప్రేక్షకులు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా ఆస్కార్ అవార్డుల రేసులోకి మన దేశం బరిలోకి నిలుస్తుందని ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వెరైటీ మ్యాగజైన్ ప్రకారం.. విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఈ సినిమా ఆస్కార్‌కు నామినేట్ అయ్యే అవకాశం ఉంది. 95వ అకాడెమీ అవార్డుల ప్రదానోత్సవం 2023, మార్చి 12న జరగనుంది. దీనికోసం రాజమౌళి గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. నిజానికి ఇండియా నుండి ఆర్ఆర్ఆర్కు అధికారిక ఎంట్రీగా ఉంటుందని భావించినా.. అది జరగలేదు. దీంతో నేరుగా జక్కన్న ఆస్కార్ ఎంట్రీ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాడు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!