కశ్మీర్ విద్యార్థులపై ఉపా చట్టం కింద కేసులు పెట్టడం సంచలనం సృష్టిస్తోంది. వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓటమి తర్వాత సంబరాలు చేసుకున్నందుకు ఉగ్రకేసుల్లో ఇరికించారు పోలీసులు. వరల్డ్కప్ ఫైనల్లో అస్ట్రేలియా విజయం తర్వాత పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారని కశ్మీర్లో ఏడుగురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. కశ్మీర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ఆ ఏడుగురు విద్యార్ధులపై UAPAకింద కేసు నమోదు చేశారు.
కశ్మీర్ విద్యార్థులపై ఉపా చట్టం కింద కేసులు పెట్టడం సంచలనం సృష్టిస్తోంది. వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓటమి తర్వాత సంబరాలు చేసుకున్నందుకు ఉగ్రకేసుల్లో ఇరికించారు పోలీసులు. వరల్డ్కప్ ఫైనల్లో అస్ట్రేలియా విజయం తర్వాత పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారని కశ్మీర్లో ఏడుగురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. కశ్మీర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ఆ ఏడుగురు విద్యార్ధులపై UAPAకింద కేసు నమోదు చేశారు. నవంబర్ 19వ తేదీ రాత్రి సెంట్రల్ కాశ్మీర్ లోని గందర్ బాల్ లోని షుహామా వద్ద ఉన్న వర్సిటీ వెటర్నరీ సైన్సెస్ ఫ్యాకల్టీ హాస్టల్లో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ హస్టల్లో సుమారు 300 మంది విద్యార్థులున్నారు. ఇందులో 30 నుంచి 40 మంది పంజాబ్, రాజస్థాన్ సహా ఇతర రాష్ట్రాలకు చెందినవారని హస్టల్ అధికారులు తెలిపారు.
అస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు ఓడిపోవడంతో కాశ్మీర్ కు చెందిన కొందరు విద్యార్థులు సంబరాలు చేసుకున్నారని ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఆరోపించారు. దీంతో నేరుగా ఓ విద్యార్థి పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు ఆధారంగా జమ్మూకాశ్మీర్ పోలీసులు ఏడుగురు విద్యార్థులపై ఉపా చట్టంతో పాటు ఐపీసీ 505 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఏడుగురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. వారి పేర్లను ఓ విద్యార్థి పోలీసులకు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను కాల్చి చంపుతామని కూడ విద్యార్థులు బెదిరింపులకు పాల్పడ్డారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధిత విద్యార్థి ఆరోపించారు. అంతేకాదు పాకిస్తాన్ అనుకూల నినాదాలు కూడ చేశారని ఆ విద్యార్థి పోలీసుల దృష్టికి తెచ్చారు.
ఈ పరిణామం జమ్మూకాశ్మీర్ రాష్ట్రేతర విద్యార్థుల్లో భయానికి కారణమైందని అతను ఆరోపించారు. అయితే కేవలం నినాదాలు చేసినందుకు ఉగ్రవాదులుగా పరిగణించాల్సిందేమి ఉందని కొన్ని ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే చొరవతీసుకుని.. ఉపా చట్టానికి చెందిన సెక్షన్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి.