తుపాను మరికొద్ది గంటల్లో పశ్చిమ మంచి బంగాళాఖాతంలోకి ప్రవేశించి.. ఆ తరువాత తీరానికి మరింత సమీపించనుంది. ఆ తరువాత ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా తీరానికి సమాంతరంగా కొంత దూరం ప్రయాణించనుంది. ఈరోజు రాత్రి – రేపు ఉదయం లోగా నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీరం దాటనుంది మిచౌంగ్. తుపాను తీరం దాటే సమయంలో 90- 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు విస్తాయి కోస్తా, రాయలసీమకు ఈ రోజు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
బంగాళాఖాతంలో MICHAUNG తుపాను కోస్తా వైపు దూసుకుస్తోంది. గంటకు 14 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది తుఫాను. పశ్చిమ మధ్య బంగాళాఖాతనికి ఆనుకుని నైరుతి బంగాళా ఖాతం లో ప్రస్తుతం తుఫాను కేంద్రీకృతమై ఉంది. వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం.. పాండిచ్చేరికి 200, చెన్నైకి 130, నెల్లూరుకు 220, బాపట్లకు 330, మచిలీపట్నానికి 350 కిలోమీటర్ల దూరంలో ఉంది మిచాంగ్.
తీరం దాటే ముందు దక్షిణ కోస్తాకు సమాంతరంగా తుఫాను ప్రయాణం..
తుపాను మరికొద్ది గంటల్లో పశ్చిమ మంచి బంగాళాఖాతంలోకి ప్రవేశించి.. ఆ తరువాత తీరానికి మరింత సమీపించనుంది. ఆ తరువాత ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా తీరానికి సమాంతరంగా కొంత దూరం ప్రయాణించనుంది. ఈరోజు రాత్రి – రేపు ఉదయం లోగా నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీరం దాటనుంది మిచౌంగ్
తుపాను తీరం దాటే సమయంలో 90- 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు విస్తాయి కోస్తా, రాయలసీమకు ఈ రోజు రెడ్ అలర్ట్.. ఈరోజు, రేపు భారీ వర్షాలు.. కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి ప్రకటించింది.
అధికారుల అప్రమత్తం.. తుఫాను రక్షిత భవనాలు సిద్ధం..
తుఫాను హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంతంలో అప్రమత్తమయ్యాయి. అధికార యంత్రాంగం అలెర్ట్స్ జారీ చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికల నేపథ్యంలో.. ఒడ్డుకే పరిమితమయ్యాయి బోట్లు, పడవలు. తుఫాను రక్షిత భవనాలను సిద్ధం చేశారు అధికారులు. విశాఖ పట్టణ ప్రాంతంలో 25, గ్రామీణ ప్రాంతంలో మరో 20 తుఫాను రక్షిత భవనాలను సిద్ధం చేసి అవసరమైతే.. ముంపు ప్రాంతాల్లో ఉన్నవారి తరలింపుకు సిద్ధమయ్యారు. అధికారులకు సెలవులు నిషేధించారు కలెక్టర్. ప్రత్యేక గంటల రూమును సిద్ధం చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు అధికారులు.
విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
విశాఖ అనకాపల్లి జిల్లాలో తుఫాను ప్రభావం మొదలైంది. ఉదయం నుంచి చెదురు మాదురుగా కొన్నిచోట్ల.. మరికొన్నిచోట్ల మోస్తారు వర్షం కురుస్తుంది. హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా ఈరోజు విశాఖ జిల్లాలో స్కూల్లో కాలేజీలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు కలెక్టర్ మల్లికార్జున. రేపటి పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందని ప్రకటన జారీ చేశారు. అధికారులంతా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అనకాపల్లి జిల్లాలోనూ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు కలెక్టర్ రవి పఠాన్ శెట్టి. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు.