అమెరికా: రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ మధ్య తాజాగా జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్ ముగిసింది.
ఈ ప్రతిష్ఠాత్మక డిబేట్‌ను నిర్వహించిన ప్రముఖ మీడియా సంస్థ ‘సీఎన్ఎన్’ ట్రంప్ దే పైచేయి అని ప్రకటించింది. ట్రంప్, బైడెన్ మధ్య డిబేట్ ముగిసిన వెంటనే సీఎన్ఎన్ ప్రసారం చేసిన పోల్ రిపోర్టులో కీలకమైన సమాచారాన్ని ప్రసారం చేశారు. ”ఈ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ?” అని ప్రశ్నించగా 67 శాతం మంది ప్రేక్షకులు ట్రంప్‌కే ఓటు వేశారని సీఎన్ఎన్ వెల్లడించింది. కేవలం 33 శాతం మందే బైడెన్‌పై విశ్వాసం వ్యక్తం చేశారని వివరించింది. ఇక ట్రంప్, బైడెన్ డిబేట్లో ద్రవ్యోల్బణం, వలసలు, అబార్షన్ హక్కులు, విదేశాంగ విధానానికి సంబంధించిన అంశాలే ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత ట్రంప్, బైడెన్ ముఖాముఖిగా చర్చలో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.