పూజా,శ్రీలీలలకు తోడు భూమి పడ్నేకర్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదట ఏప్రిల్ 2023 లో సినిమాను విడుదల చేయాలని భావించారు.
కానీ షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల ఏప్రిల్ లో విడుదల చేయలేక పోతున్నట్లుగా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. కొత్త విడుదల తేదీ విషయంలో చర్చ జరుగుతోంది.ఇదే సమయంలో సినిమాలోని నటీ నటుల విషయంలో కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్నట్లు ప్రకటన వచ్చింది. ఆ తర్వాత శ్రీ లీలా కూడా మరో హీరోయిన్ గా ఈ సినిమాలో నటించబోతున్నట్లుగా నిర్మాత స్వయంగా పేర్కొన్నాడు. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ భూమి పడ్నేకర్ ను కీలక పాత్రలో చూపించబోతున్నారని తెలుస్తోంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ కీలక పాత్ర ను భూమి పడ్నేకర్ తో చేయించడం ద్వారా హిందీ ప్రేక్షకుల్లో కూడా సినిమాపై ఆసక్తి పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. లేడీ కానిస్టేబుల్ పాత్రకు గాను భూమి పడ్నేకర్ ను సంప్రదించారని.. ఆమె ఓకే చెప్పిందని కూడా ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటి వరకు మేకర్స్ నుండి ఈ విషయమై ఎలాంటి స్పష్టత రాలేదు. హీరోయిన్ గా ఇద్దరు ముద్దుగుమ్మలు నటిస్తూ ఉండగా మరో హీరోయిన్ భూమి పడ్నేకర్ ను కూడా ఎంపిక చేయబోతున్నారనే వార్తలు మహేష్ బాబు ఫ్యాన్స్ లో ఆసక్తి ని రేకెత్తిస్తున్నాయి.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!