అరకులోయ, నవంబర్ 3, (ఆంధ్రపత్రిక) : మానభంగం, హత్యానేరంపై ఓ గిరిజనుడిని అరెస్టు చేసినట్టు అరకులోయ పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.దేముడుబాబు తెలిపారు. స్థానిక పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ సర్కిల్ పరిధిలోని నందివలస గ్రామానికి చెందిన గెమ్మెలి సావిత్రి అనే గిరిజన యువతిపై ఇదే గ్రామానికి చెందిన జన్ని రామచంద్ర అనే గిరిజనుడు అత్యాచారానికి పాల్పడి దారుణంగా చంపేశాడని ఆయన తెలిపారు. నిందితుడికి భార్య ఉన్నప్పటికీ పరాయి యువతి సావిత్రిపై మోజుపడి నిత్యం వేధించేవాడని దర్యాప్తులో తేలిందని ఆయన చెప్పారు. గత నెల 29వ తేదీన ఈ అఘాయిత్యానికి గిరిజనుడు పాల్పడి గుట్టుచప్పుడు కాకుండా విషయాన్ని దాచిపెట్టి ఏమీ తెలియనట్టు వ్యవహరించేవాడని, అయితే కన్న కూతురు కనిపించకపోవడంతో జన్ని రామచంద్రపై అనుమానించిన మృతురాలి తండ్రి డుంబ్రిగుడ పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. దీంతో తమదైన శైలిలో అన్ని కోణాల్లో సమగ్రంగా విచారించి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నామన్నారు. భార్య ఉండగానే గెమ్మెలి సావిత్రిని రెండో భార్యగా పెళ్లి చేసుకునేందుకు రామచంద్ర ముందుకు వచ్చాడని, పెళ్లికి యువతి అభ్యంతరం తెలపడంతో మద్యం మత్తులో ఉన్న ఈ కామాంధుడు సావిత్రిని మానభంగం చేసి ఆ పిదప హత్యచేసినట్టు ఆయన తెలిపారు. ఈ కేసును చేధించడంలో డుంబ్రిగుడ, అరకులోయ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్లు సంతోష్, సంతోష్‌కుమార్, పోలీసు సిబ్బంది చురుకైన పాత్ర పోషించినట్టు సిఐ జి.దేముడుబాబు వెల్లడిరచారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!