రాజమహేంద్రవరం, సెప్టెంబరు 26(ఆంధ్రపత్రిక)
రామదాసు సహకార శిక్షణ కేంద్రం రాజమహేంద్రవరం శిక్షణ విద్యార్ధులు ఆచరణాత్మక శిక్షణలో భాగంగా తొర్రేడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాన్ని మంగళవారం సందర్శించారు. రామదాసు సహకార శిక్షణ కేంద్రం అధ్యాపకులు మరియు జిల్లా సహకార శిక్షణ ఇన్చార్జ్ అయిన ఆదిమూలం వెంకటేశ్వరరావు పరిచయ కార్యక్రమము నిర్వహిస్తూ సహకార విద్య మరియు సంఘం చేయు సేవలు గురించి వివరించినారు. నాగార్జున ఫర్టిలైజర్ అండ్ కెమికల్ రీజనల్ మేనేజర్ సత్యనారాయణ మాట్లాడుతూ రైతులకు సరఫరా చేసే ఎరువుల విక్రయం మరియు ఈ పాస్ గురించి తెలిపారు. ఈ కార్యక్రములో సంఘ ముఖ్య కార్యనిర్వహణాధికారి అయిన కొడవలి వీర వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ సంఘము యొక్క నిర్వహణ మరియు పనితీరు గురించి పూర్తిగా వివరిస్తూ సంఘ ముఖ్యకార్యనిర్వహణాధికారి యొక్క ముఖ్య పాత్ర మరియు సిబ్బంది యొక్క భాధ్యతలు గురించి వివరించి తెలిపియున్నారు. రామదాసు శిక్షణా కేంద్రం ప్రిన్సిపల్ వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ సంఘ బైలాల గురించి, మహాజన సభ ఏర్పాటు చేయుట, తీర్మాణాలు చేయు విధానముపై వివరించియున్నారు. డి.సి.సి.బి బ్రాంచి నోడల్ ఆఫీసర్ శ్రీమతి ఉమారాణి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో 52 బ్రాంచీలు ద్వారా 299 పి.ఏ. సి. యస్ లలో గల సభ్యులకు వ్యవసాయ ఋణములు, ఇతర ఋణములు పంపిణీ చేయుచున్నాము. ఈ సంవత్సరం రైతునేస్తం పథకం ద్వారా ఎకరమునకు రూ.8 లక్షలు ఋణము మంజూరు చేయుచున్నామని తెలిపియున్నారు. బ్రాంచి చీఫ్ మేనేజర్ పల్లవి మాట్లాడుతూ బ్యాంకు యొక్క విధులు, సంఘములలో తనిఖీలు ఏ విధంగా నిర్వహిస్తారో తదితర అంశాలు తెలిపియున్నారు. డి.సి.సి.బి బ్రాంచి మేనేజర్ జి.అప్పారావు మాట్లాడుతూ సంఘమును ఏవిధంగా అభివృద్ధి చెయ్యాలి, నిధులు సమకూర్చుట తదితర అంశాలపై తెలిపియున్నారు. ఈ కార్యక్రమునకు సంఘ చైర్ పర్సన్ చిట్టూరి వెంకటరావు, పర్సన్స్ దండమూడి అర్జునరావు, గద్దె సుబ్బారావు, మరియు బ్రాంచి సూపర్ వైజర్ లోకేష్ పాల్గోన్నారు.