సినిమా ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా మరో సీనియర్ నటి కన్నుమూశారు. బాలీవుడ్ దిగ్గజ హీరో గురుదత్ చెల్లెలు, నటి లలితా లాజ్మీ తుదిశ్వాస విడిచారు.
ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు ఆమె కుటుంబ సభ్యలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. చివరగా ఆమె.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమిర్ ఖాన్ సినిమాలో నటించింది.
గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో లాజ్మీ బాధపడుతోంది. తారే జమీన్ పర్ సినిమాలో ఆర్ట్ టీచర్‌గా ఆమె నటించారు. ఆమె వేసిన పెయింటింగ్స్‌తో అంతర్జాతీయ ఆర్ట్ గ్యాలరీల్లో ఎన్నో ఎగ్జిబిషన్లు నిర్వహించారు. సినిమాలతో అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. నటిగానే కాకుండా రచయితగానూ పలు పుస్తకాలు రాశారు. లాజ్మీ మరణవార్త విన్న
బాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది.