విశాఖపట్నం, ఫిబ్రవరి 9 (ఆంధ్రపత్రిక): కంచరపాలెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కంచరపాలెం రైతు బజార్, మర్రిపాలెం, 104 ఏరియా, బి ఆర్ టి ఎస్ సర్వీస్ రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న షాపులు, బడ్డీలు, తోపుడు బళ్ళను ట్రాఫిక్ కు అంతరాయం కలిగించే, పార్కు చేసి ఉన్న వాహనాలను వార్డ్ సచివాలయం ప్లానింగ్ సిబ్బంది, కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా తొలగించే కార్యక్రమం చేపట్టారు. రోడ్డు కి ఇరువైపులా ఉన్న అనాధరైజుడు బడ్డీలను, వాహనాలను తొలగించడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం అయినది. ట్రాఫిక్ అంతరాయం కలిగించేటట్టుగా వ్యాపారాలు నిర్వహించే వారికి కౌన్సిలింగ్ ఇవ్వడమైనది. నిబంధనలను అతిక్రమించి న 15 మంది మీద కేసులు నమోదు చేయడం అయినది. ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ రోడ్డుకు ఇరువైపులా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై వాహనాలను రోడ్లపై పార్కు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ఈ సందర్భంగా వాళ్లు తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో కంచరపాలెం ట్రాఫిక్ సి ఐ మళ్ళ అప్పారావు, ట్రాఫిక్ ఎస్ఐ వాసుదేవరావు , ఎ ఎసై ఆదినారాయణ, హెచ్ సి లు జయశీలన్, సురెష్, కానిస్టేబుల్స్, మోహన్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!