టమోటా.. 20 రోజుల క్రితం వరకు రైతులకు కాసుల పంట కురిపించింది. ఇప్పుడు అదే రైతుకు కంటతడి పెట్టిస్తోంది. జూన్ జూలై నెలలో అమాంతంగా పెరిగిన టమోటా ధరలు ఆగస్టు 11 వరకు ఊహకందని ధరలతో రైతును కోటీశ్వరుడిని చేసింది. మునుపెన్నడూ లేని రీతిలో ఏకంగా కిలో టమోటా ధర డబుల్ సెంచరీ పలకడంతో సాగు చేసిన టమోటా ను పంటను కాపలా కాయడమే కష్టంగా మారిపోయిన పరిస్థితికి తలెత్తింది.
టమోటా.. 20 రోజుల క్రితం వరకు రైతులకు కాసుల పంట కురిపించింది. ఇప్పుడు అదే రైతుకు కంటతడి పెట్టిస్తోంది. జూన్ జూలై నెలలో అమాంతంగా పెరిగిన టమోటా ధరలు ఆగస్టు 11 వరకు ఊహకందని ధరలతో రైతును కోటీశ్వరుడిని చేసింది. మునుపెన్నడూ లేని రీతిలో ఏకంగా కిలో టమోటా ధర డబుల్ సెంచరీ పలకడంతో సాగు చేసిన టమోటా ను పంటను కాపలా కాయడమే కష్టంగా మారిపోయిన పరిస్థితికి తలెత్తింది. కానీ అంతలోనే సీన్ మారాపోయింది. సరిగ్గా 20 రోజులు గడిచేసరికి కొండెక్కిన టమాటా కాస్త.. నేల చూపులు చూస్తోంది. జూలై నెల ఆఖరు వరకు 196 రూపాయిల వరకు కిలో ధర పలికిన టమోటా ఇప్పుడు ఏకంగా కిలో 7 రూపాయలకు పడిపోయింది. మదనపల్లి టమాటా మార్కెట్లో టన్నుల కొద్దీ పంట వస్తుండటం.. ఇతర ప్రాంతాలనుంచి బయ్యర్లు రాకపోవడంతో టమాటా రైతు దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. 20 రోజుల క్రితం వరకు మదనపల్లి మార్కెట్ కు టమోటాలు తీసుకొచ్చి జేబునుండా డబ్బులు తీసుకెళ్లిన టమోటా రైతు ఇప్పుడు ఖాళీ జేబులతో ఇంటికి వెళ్తున్న పరిస్థితి నెలకొంది.