అక్టోబర్ 31 (ఆంధ్రపత్రిక): వరుణ్ ధావన్, కృతిసనన్ జంటగా నటిస్తున్న చిత్రం ’బేడియా’. అమర్ కౌశిక్ దర్శకుడు. జియో స్టూడియోస్ సమర్పణలో దినేష్ విజాన్ నిర్మిస్తున్నారు. హిందీతో పాటు తెలుగులో ’తోడేలు’ టైటిల్‌తో నవంబర్ 25న రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ’తుంకేశ్వరి’ అనే తెలుగు పాటను విడుదల చేశారు. ’వలచిన చెలియ కథ.. చేరువ వచ్చి తోడువయ్యవా. కలిసిన మనసు కథ.. కోరి వచ్చి నీడవయ్యవా’ అంటూ సాగిన ఈ స్పెషల్‌లో సాంగ్‌లో వరుణ్, కృతి స్టెప్స్ హైలైట్‌గా ఉన్నాయి. సచిన్ జిగర్ ట్యూన్ చేయగా, యనమండ్ర రామకృష్ణ లిరిక్స్ రాశారు. కార్తీక్,అనూష మణి కలిసి పాడారు. గణెళిష్ ఆచార్య డ్యాన్స్ కంపోజ్ చేశారు. పాట రిలీజ్ సందర్భంగా వరుణ్ మాట్లాడుతూ ’ప్లోర్ అదిరిపోయే డాన్స్ నెంబర్ ఇది. ఈ పాటలో పెర్ఫార్మ్ చేయడాన్ని ఎంజాయ్ చేశాను. థియేటర్‌లో ఆడియెన్స్ స్టెప్పులేస్తారు’ అన్నాడు. కృతి సనన్ మాట్లాడుతూ ’వరుణ్‌కి జోడీగా ఇలాంటి పాటలో కనిపించి చాలా రోజులవుతోంది. షూటింగ్ టైమ్‌ను ఎంజాయ్ చేశాం. ఇదొక మంచి ఎక్స్‌పీరియెన్స్’ అని చెప్పింది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!