నాగ్‌పూర్,సెప్టెంబర్ 22 (ఆంధ్రపత్రిక): భారత్, ఆస్టేల్రియా మధ్య రెండో టీ20 23న శుక్రవారం నాగ్‌పుర్‌లో జరగనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలిమ్యాచ్ నెగ్గిన ఆస్టేల్రియా 1`0తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలుపొంది సిరీస్ సొంతం చేసుకోవాలని పర్యాటక జట్టు పట్టుదలగా ఉంది. మరోవైపు తొలిమ్యాచ్‌లో బ్యాటర్లు సత్తా చాటినా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడం, పేలవ ఫీల్డింగ్ కారణంగా ఓటమి చవిచూసిన టీమ్ఇండియా ఈ మ్యాచ్‌లో గాడిలో పడాలని కోరుకుంటోంది.
నాగ్‌పూర్ వేదికగా భారత్, ఆస్టేల్రియా మధ్య రెండో టీ20 జరగనుంది. ఆసియాకప్‌లో ఫైనల్‌కు చేరకుండానే ఇంటిముఖం పట్టిన టీమ్ ఇండియా, ఆస్టేల్రియాతో జరిగిన తొలి టీ20లో కూడా పరాజయం చవిచూసింది. వచ్చే నెలలో టీ20 ప్రపంచకప్ జరగనున్న వేళ భారత్ జట్టుకు ఇంకా అనేక సమస్యలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా పేస్ బౌలర్లు చివరి ఓవర్లలో భారీగా పరుగులిస్తుండటం టీమ్ఇండియాను కలవరపెడుతోంది. వెన్నునొప్పి కారణంగా ఆసియాకప్‌కు దూరమైన పేసర్ బుమ్రా ఆసీస్‌తో సిరీస్‌కు ఎంపికైనా తొలిమ్యాచ్‌లో అతన్ని టీమ్‌మేనేజ్‌మెంట్ ఆడిరచలేదు. ఈ నేపథ్యంలో బుమ్రా పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడా లేడా అనేది సందేహంగా మారింది. టీ20 ప్రపంచకప్ కంటే ముందు టీమ్ఇండియా ఇంకా 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉన్న నేపథ్యంలో బుమ్రా రాక కీలకంగా మారింది. మొహాలీ టీ20లో భారత పేసర్లు 14 ఓవర్లలో ఏకంగా 150 పరుగులు సమర్పించుకున్నారు. గత కొన్ని మ్యాచ్‌లుగా భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. చాహల్ స్థానంలో అశ్విన్‌కు తుదిజట్టులో చోటు దక్కుతుందో లేదో వేచి చూడాలి. మరోవైపు రవీంద్ర జడేజా స్థానంలో జట్టులోకి వచ్చిన ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్.. మొహాలీ టీ20లో 3 వికెట్లతో సత్తా చాటాడు. ఆస్టేల్రియాతో జరిగిన పోరులో భారత్ ఫీల్డింగ్ కూడా పేలవంగా ఉంది. మూడు క్యాచ్‌లను భారత ఫీల్డర్లు వదిలేశారు. భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి దీనిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మరోవైపు డేవిడ్ వార్నర్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ మార్ష్ వంటి కీలక ఆటగాళ్లు లేకపోయినా తొలి టీ20లో ఆస్టేల్రియా విజయం సాధించింది. డేవిడ్ వార్నర్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ అర్థశతకంతో సత్తా చాటాడు. స్టీవెన్ స్మిత్, టిమ్ డేవిడ్ కూడా రాణించారు. 21 బంతుల్లోనే 45 పరుగులు చేసి ఫినిషర్ పాత్రలో మాథ్యూ వేడ్ సత్తా చాటాడు. ఐతే రెండో టీ20లో బౌలర్లు మెరుగ్గా రాణించాలని..ముఖ్యంగా పేసర్లు పాట్‌కమ్మిన్స్, హేజిల్‌వుడ్, గ్రీన్.. భారత బ్యాటర్లను కట్టడి చేయాలని ఆస్టేల్రియా కోరుకుంటోంది. ఐతే నాగ్‌పూర్‌లో వీసీఏ స్టేడియం మొహాలీ పిచ్ మాదిరిగా ఉండదని ఇక్కడ వికెట్ స్లోగా ఉంటుందని భావిస్తున్నారు. అప్పుడు బౌలర్లకు పిచ్ అనుకూలించే అవకాశం ఉంటుంది. మ్యాచ్ శుక్రవారం రాత్రి ఏడున్నరకు ప్రారంభంకానుండగా..టాస్ గెలిచే జట్టు తొలుత ఫీల్డింగ్ చేసేందుకే మొగ్గు చూపుతుందని భావిస్తున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!