తిరుమల నడకమార్గాల్లో చిరుతల సంచారం తో భక్తుల్లో భయాన్ని పోగొట్టేందుకు టీటీడీ శాశ్వత పరిష్కారానికి శ్రీకారం చుడుతోంది. అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గంలో ఇనుపకంచెల నిర్మాణాలకు టిటిడి ప్రతిపాదనలను సిద్దం చేసింది. రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉన్న నడకమార్గాల్లో ఇనుప కంచె వేయడానికి కేంద్ర అటవీ శాఖకు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ప్రతిపాదనలు పంపినట్లు స్పష్టం చేసింది.
తిరుమల నడకమార్గాల్లో చిరుతల సంచారం తో భక్తుల్లో భయాన్ని పోగొట్టేందుకు టీటీడీ శాశ్వత పరిష్కారానికి శ్రీకారం చుడుతోంది. అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గంలో ఇనుపకంచెల నిర్మాణాలకు టిటిడి ప్రతిపాదనలను సిద్దం చేసింది. రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉన్న నడకమార్గాల్లో ఇనుప కంచె వేయడానికి కేంద్ర అటవీ శాఖకు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ప్రతిపాదనలు పంపినట్లు స్పష్టం చేసింది. తగిన డిజైన్లతో అంగీకారం తెలిపితే కంచె నిర్మాణానికి సిద్ధమంటోంది టీటీడీ యంత్రాంగం.
ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా.. గోవిందా.. అంటూ తిరుమల నడక మార్గాల్లో కొండెక్కి భక్తుల్లో ఇప్పుడు క్రూర మృగాల భయం వెంటాడుతోంది. ఆపదమొక్కుల స్వామికి అడుగడుగునా దండాలు పెడుతూ కొండెక్కే భక్తులు ఇప్పుడు భయంతో పలు ఆంక్షలుతో తిరుమల యాత్ర కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ మధ్యకాలంలో అలిపిరి నడక మార్గంలో వరుస చిరుత దాడులు, ఆగస్టు 11న లక్షితపై చిరుత దాడి చేసి చంపడంతో భక్తుల్లో భయం మరింతగా పెరిగింది. మరోవైపు నాలుగు చిరుతలను నడక మార్గంలో బంధించిన అటివీశాఖ 5వ చిరుత సంచారం ఉన్నట్లు తీర్చడంతో భక్తుల్లో భయం రెట్టింపు అయింది. రెండు నరకమార్గాల్లో 500 ట్రాప్ కెమెరాలతో చిరుతలు క్రూర మృగాలు కదలికలపైమానిటరింగ్ చేస్తున్న టిటిడి, అటవీశాఖ లు చిరుతల భయం భక్తుల్లో లేకుండా చేసేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నాయి. నడక మార్గంలో పలు ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే సెక్యూరిటీని పెంచడం, భక్తులకు చేతి కర్రలు ఇచ్చి పంపడం చేస్తున్న టిటిడి నడకమార్గాల్లో ఇరుపకంచె నిర్మాణాల కోసం ప్రతిపాదనను కేంద్రానికి పంపింది.
7.2 కిలోమీటర్ల దూరం 3550 మెట్లు ఉన్న అలిపిరి నడక మార్గం, మరోవైపు 2.1 కిలో మీటర్ దూరంలో 2650 మెట్లు ఉన్న శ్రీవారి మెట్టుమార్గం ఇరువైపులా ఇనుప కంచె నిర్మాణం చేపట్టాలని భక్తుల నుంచి డిమాండ్ ఎప్పటినుంచో వినిపిస్తోంది. ఎస్ వి అభయారణ్యంలో టిటిడి ఫారెస్ట్ పరిధి కేవలం 8వేల ఎకరాల లోపే ఉండగా అందులోనే రెండు నడకమార్గాలున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న క్రూర మృగాలు సంచరించే సమయంలో మధ్యలో ఉన్న నడకమార్గాలను క్రాస్ చేయడం ఎప్పటినుంచో జరుగుతూ ఉందన్నది అటవీ శాఖ వాదన. ఈ నేపథ్యంలో నడకమార్గాలకు ఇరువైపులా కంచె నిర్మాణం చేపట్టడం అటవీ శాఖ చట్టాలకు విరుద్ధమైన వాదన ఎప్పటినుంచో వినిపిస్తుండగా ఇప్పుడు మనుషులపై వరుసదాడులతో మరోసారి కంచె నిర్మాణం చర్చగా మారింది. దీంతో టీటీడీ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న నడక మార్గాల్లో ఇరుపకంచ వేయడానికి కేంద్ర అటవీ శాఖకు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కు ప్రతిపాదనలను పంపింది. తగిన డిజైన్లతో అంగీకారం తెలిపితే నడకమార్గాల్లో ఇరువైపులా కంచి నిర్మాణంచేపట్టేందుకు టీటీడీ సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేస్తోంది.
అయితే ఇప్పటికే టీటీడీ ప్రతిపాదనలు కేంద్రానికి చేరగా అభయారణ్యంలో జంతువుల స్వేచ్ఛ లేకుండా కంచెల నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతులివ్వడం అంత ఈజీ కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది. శేషాచలంలో చిరుతల సంతతి పెరగడం వల్ల నడక మార్గంలో భక్తులకు ఇబ్బంది కలుగుతున్నా చిరుతలను కంచెల నిర్మాణంతో కట్టడి చేసేలా చర్యలు తీసుకునే అవకాశం ఉండదని అడవి శాఖ అభిప్రాయపడుతోంది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారానే చిరుతల సమస్యకు పరిష్కారం చూపాల్సి ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తమౌతోంది.