Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే..
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆదివారం భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు (Devotees) నిండిపోయి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి.
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆదివారం భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు (Devotees) నిండిపోయి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.