వడ్డీ కాసులవాడిని దర్శనం చేసుకుని తమ మొక్కులను కానుకల రూపంలో సమర్పించుకుంటారు. అయితే శ్రీవారి వార్షిక ఆదాయం ఏడాదికి లక్షరూపాయలు దాటేది కాదు.. కాలక్రమంలో రవాణా సౌకర్యాలు పెరగడంతో పాటు వివిధ కారణాలతో రోజు రోజుకీ స్వామివారి హుండీ ఆదాయం లక్షలు దాటి కోట్లకు చేరుకుంది. తాజాగా నవంబర్ నెలకు సంబంధించిన వెంకన్న హుండీ ఆదాయాన్ని టీటీడీ ప్రకటించింది. వివరాల్లోకి వెళ్తే..
కలియుగ దైవం శ్రీనివాసుడు కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి. కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు.. దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. వడ్డీ కాసులవాడిని దర్శనం చేసుకుని తమ మొక్కులను కానుకల రూపంలో సమర్పించుకుంటారు. అయితే శ్రీవారి వార్షిక ఆదాయం ఏడాదికి లక్షరూపాయలు దాటేది కాదు.. కాలక్రమంలో రవాణా సౌకర్యాలు పెరగడంతో పాటు వివిధ కారణాలతో రోజు రోజుకీ స్వామివారి హుండీ ఆదాయం లక్షలు దాటి కోట్లకు చేరుకుంది. తాజాగా నవంబర్ నెలకు సంబంధించిన వెంకన్న హుండీ ఆదాయాన్ని టీటీడీ ప్రకటించింది. వివరాల్లోకి వెళ్తే..
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నవంబర్ నెల ఆదాయం రూ. 108.46 కోట్లు గా టీటీడీ ప్రకటించింది. సామాన్యుడి నుంచి సంపన్నుడు వరకూ వెంకన్న హుండీలో సమర్పించిన నెల రోజుల కానుకల మొత్తం రూ. 108.46 కోట్లు వచ్చింది. నవంబర్ నెలలో 19.73 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఈ మేరకు రోజు వారీ హుండీ కానుకలను లెక్కించిన టీటీడీ నెల మొత్తంలో వచ్చిన ఆదాయాన్ని వివరించింది. ప్రతినెల డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు, వారు హుండీ లో సమర్పించిన కానుకలు, తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న భక్తులు, అన్న ప్రసాదం స్వీకరించిన భక్తులు, లడ్డూల విక్రయం వివరాలను ఈఓ ప్రకటిస్తున్నారు.
ఇందులో భాగంగానే టీటీడీ ఈవో ధర్మారెడ్డి నవంబర్ నెల వివరాలను భక్తులకు వివరించారు. రూ. 108.46 కోట్ల హుండీ ఆదాయంతో పాటు భక్తులకు 94.47 లక్షల లడ్డూల విక్రయించినట్లు చెప్పారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తుల్లో 36.50 లక్షల మంది అన్న ప్రసాదం స్వీకరించగా 7.06 లక్షల మంది భక్తులు వెంకన్నకు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నట్లు ఈఓ ధర్మారెడ్డి ప్రకటించారు.