ఏడుకొండల వాడి ఆస్తిని హారతి కర్పూరంలా కరిగించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని మండిపడుతున్నారు బీజేపీ నేతలు. టీటీడీ నిధులను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు మళ్లింంచాలన్న నిర్ణయాన్ని తప్పుబట్టారు భానుప్రకాశ్ రెడ్డి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఓటు బ్యాంకు రాజకీయాలకు అధికార వైసీపీ పాల్పడుతోందని అన్నారు
ఆపద మొక్కులు తీర్చే ఆ ఏడుకొండలవాడికి పెద్ద కష్టమొచ్చింది. కుబేరుడి నుంచి ఆయన తీసుకున్న అప్పు తీర్చడం కలియుగంలో సాధ్యపడదేమో. దానికి కారణం లేకపోలేదు. దానికి కారణం భక్తుల మనోభావాలు దెబ్బతీసే వివాదాస్పద నిర్ణయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల బోర్డు తీసుకోవడం. టీటీడీ వార్షిక బడ్జెట్ నుంచి ఒక శాతం మొత్తాన్ని తిరుపతి నగరపాలక సంస్థకు కేటాయించాలని నిన్న జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల బోర్డు నిర్ణయం తీసుకుంది.
దశాబ్దాలుగా తిరుపతి నగరాభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్నట్టుగా ఉందని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అంటున్నారు. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉందని ఆయన వాదిస్తున్నారు. తిరుపతి మీదుగా భక్తులు తిరుమల కొండకు వస్తారు కాబట్టి తిరుపతి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని టీటీడీ అంటోంది. ఈ క్రమంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద బడ్జెట్లో ఒక శాతం నిధులను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు కేటాయించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది.
ఏడుకొండల వాడి ఆస్తిని హారతి కర్పూరంలా కరిగించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని మండిపడుతున్నారు బీజేపీ నేతలు. టీటీడీ నిధులను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు మళ్లింంచాలన్న నిర్ణయాన్ని తప్పుబట్టారు భానుప్రకాశ్ రెడ్డి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఓటు బ్యాంకు రాజకీయాలకు అధికార వైసీపీ పాల్పడుతోందని అన్నారు
టీటీడీ నిధులను ధార్మిక, దైవ కార్యక్రమాలకు ఉపయోగించాలి తప్ప ఇతర కార్యక్రమాలకు ఎలా వినియోగిస్తారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. తిరుపతి నగరానికి సంబంధించి ఇప్పటికే ఎన్నో కోట్ల రూపాయలను టీటీడీ ఖర్చు చేస్తున్న విషయాన్ని భక్తులు ప్రస్తావిస్తున్నారు. తిరుపతిలో రోడ్లు, పారిశుధ్య పనులకు టీటీడీ నిధులు ఖర్చు చేస్తోంది. వాస్తవానికి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెప్తున్నట్టు కార్పొరేట్ సోషల్ రెస్పాసిబిలిటీ అన్నది తిరుమల తిరుపతి దేవస్థానానికి వర్తించదని భక్తులు చెప్తున్నారు. . భక్తుల కానుకులు, విరాళాలతో నడిచే ధార్మిక సంస్థ టీటీడీ. ఆ నిధులను కేవలం దైవిక కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలని చట్టం చెప్తోంది. అధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల కోసమే టీటీడీ నిధులు వెచ్చించాలని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ చట్టం చెప్తోంది. ఈ క్రమంలో ఇప్పుడుబోర్డు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది.