డిసెంబర్ 11 (ఆంధ్రపత్రిక): మాస్ మహారాజా అంటేనే ఎనర్జిటిక్ హీరో అని పేరు ఉంది.. ఈయన ఎనర్జీని ఎవ్వరు కూడా బీట్ చేయలేరు అనే చెప్పాలి.. ఎందుకంటే రవితేజ ఒక సినిమా రిలీజ్ కాకుండానే మరో రెండు సినిమాలు లైన్లో పెడతాడు. అయితే ఒకప్పుడు వరుస హిట్స్ ను ఖాతాలో వేసుకునే ఆయన ఇప్పుడు మాత్రం వరుస ప్లాప్స్ ఎదుర్కొంటున్నాడు.. ఒక్క సూపర్ హిట్ వస్తే.. ఆ వెంటనే బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ ఎదురవుతూనే ఉన్నాయి. దీంతో రవితేజ రేసులో వెనకబడి పోతున్నాడు.. ఇటీవలే రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్లాప్ ఎదుర్కున్నాడు. ఇక ప్రెసెంట్ రవితేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమాను కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో అయినా అన్ని ప్లాప్స్‌ను మరిపించేలా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయి ప్రొమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు. ఇప్పటికే ఈ సినిమా నుండి ప్రేక్షకులను అలరించాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి ట్రైలర్ రాబోతుంది అని మేకర్స్ అఫిషియల్‌గా అనౌన్స్ చేసారు. ఈ సినిమా ట్రైలర్ డిసెంబర్ 15న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అఫిషియల్ గా కన్ఫర్మ్ చేసారు.. దీంతో ఈ ట్రైలర్ ఎలా ఉంటుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను క్రిస్మస్ బరిలో దింపబోతున్నారు. డిసెంబర్ 23న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇందులో మాస్ మహారాజా, శ్రీలీల జోడీ ఎనర్జీ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఓవరాల్‌గా సాంగ్ మంచి ఎనర్జిటిక్ అనే చెప్పాలి. చూడాలి ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!