రవితేజ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. అందులో టైగర్ నాగేశ్వరరావు ఒకటి. ఈ చిత్రం ఇండియన్ రాబిడ్ హుడ్‌గా పిలవబడే గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ అధారంగా తెరకెక్కనుంది. 70,80 దశకాల్లో నాగేశ్వరరావు ఆంధ్ర ప్రదేశ్‌లో భారీ ఎత్తున దొంగతనాలు, దోపిడీలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే వాడు. ఇలాంటి గజదొంగ కథ బయోపిక్‌గా తెరకెక్కనుంది అనడంతో ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేజర్ అప్డేట్ను చిత్రబృందం ప్రకటించింది. టైగర్ నాగేశ్వరరావు షూటింగ్ భారీ స్థాయిలో జరగుతుంది త్వరలోనే ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేస్తా అంటూ నిర్మాత అభిషేక్ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ’కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ ఫేం వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.మాస్ మహరాజా బోలెడన్ని ఆశలతో ’ధమాకా’తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రిలీజ్ రోజున మిక్డ్స్ టాక్ తెచ్చుకుంది. కానీ ఓపెనింగ్స్ అదిరిపోయాయి. టాక్‌తో సంబంధంలేకుండా రోజు రోజుకు కలెక్షన్లు పెరుగుతూ వచ్చాయి. ఫస్ట్ వీక్‌లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండు వారాల్లోనే వంద కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. రవితేజ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, శ్రీలీల డ్యాన్సులు ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేశాయి. రవితేజ కెరీర్లో తొలి వంద కోట్ల గ్రాస్ సినిమా ఇదే అవడం గమనార్హం.ఇదే అనుకుంటే తర్వాత వచ్చిన వాల్తేరు వీరయ్య కూడా తిరుగులేని విజయాన్ని సాధించింది. ఈ సినిమా సక్సెస్‌లో సగం క్రెడిట్ రవితేజకే దక్కుందన్న మాట వాస్తవం. చిరు పాత్రకు వంకపెట్టలేం కానీ, సోలోగా వచ్చుంటే మాత్రం ఈ రేంజ్లో హిట్టయ్యేది కాదు. ఈ విషయాన్ని స్వయంగా చిరునే ఓ సందర్భంలో చెప్పాడు. ఇలా వరుస బ్యాక్ టు బ్యాక్ హిట్లు రవితేజకు మంచి ఉత్సాహాన్నిచ్చాయి. ప్రస్తుతం అదే స్పీడ్‌తో సెట్స్‌పై ఉన్న సినిమాలను పూర్తి చేస్తున్నాడు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!