నెల్లూరు జిల్లాలో ఎస్సీ యువకుడి ఆత్మహత్యపై టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ డీజీపీకి లేఖ రాశారు. ఎస్సీ యువకుడు కరుణాకర్ ఆత్మహత్యకు కార కులైన వారిని వెంటనే శిక్షించాలని ఆయన డిమా ండ్ చేశారు. చెరువులో చేపలు పట్టకుండా వైసీపీ నాయ కులు అడ్డుకోవడం, వారి వేధింపులు తాళలేక మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకు న్నాడని వెల్లడిరచారు.రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయని అన్నారు. వైఎస్ జగన్ పాలనలో బలహీనవర్గాలు బలైతున్నాయని ఆందో ళన వ్యక్తం చేశారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటేనే ఎస్సీలకు రక్షణ ఏర్పడుతుందని అన్నారు. బలహీనవర్గాలు, ఎస్సీలపై రాష్ట్రంలో దాడులు నిత్యకృత్యమయ్యాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కావలిలో కరుణాకర్ అనే ఎస్సీ యువకుడి మృతికి కార కులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డీజీపీకి లేఖ రాశారు. నెల్లూరు జిల్లా కావ లిలో కరుణాకర్ అనే ఎస్సీ యువకుడి మృతికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగు దేశం అధినేత చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. బలహీనవర్గాలు, ఎస్సీలపై రాష్ట్రంలో దాడులు నిత్యకృత్యమయ్యా యని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముసునూరులో చేపల చెరువులు సబ్ లీజుకు తీసుకుని వ్యాపారం చేసుకుంటున్న కరుణాకర్‌ను వైకాపా నేతలు జగదీశ్వరరెడ్డి, సురేశ్‌రెడ్డి చేపలు పట్టుకోనీయకుండా వేధించారని పేర్కొన్నారు. అందుకే కరుణాకర్ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడిరచారు. ఎస్సీలపై దాడి చేసిన వారి పట్ల పోలీసుల ఉదాసీనత కారణంగానే నిందితులు బరితెగిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. వైకాపా నేతల వేధింపులు తాళలేక తీవ్ర మనస్తాపానికి గురైన ఓ దళిత యువకుడు శనివారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూ.20 లక్షలు అప్పు చేసి చెరువులో చేపలు పెంచితే, వాటిని పట్టుకోకుండా అడ్డుపడుతున్నారని, తనతోపాటు తన తల్లినీ వేధించారని సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. పోలీసులు, మృతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. కావలి పట్టణం ముసునూరు ఎస్సీకాలనీకి చెందిన దుగ్గిరాల కరుణాకర్(36) చేపల చెరువును సబ్ లీజుకు తీసుకొని మత్స్య వృత్తితో జీవనం సాగిస్తున్నారు. రెండేళ్లుగా వరదలు, వర్షాల కారణంగా చేపలు కొట్టుకుపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు.ఈసారి వర్షాలు కురిసేలోపే చేపలు పట్టి విక్రయించాలని భావించగా, ముసునూరుకు చెందిన అధికార పార్టీ నాయకులు అడ్డుకున్నారు. శ్రీశైలం ట్రస్టుబోర్డు సభ్యుడు, వైకాపా సేవాదళ్ రాష్ట్ర కన్వీనర్ కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి పదేపదే అడ్డుకోవడంతో పాటు గత నెలలో చెరువులో మందు కలపడంతో పెద్దఎత్తున చేపలు మృత్యువాత పడ్డాయి. తీవ్ర ఒత్తిడికి లోనైన కరుణాకర్ అనారోగ్యానికి గురయ్యాడు. ప్రజాప్రతినిధులు, అధికారులను కలసి సమస్య వివరించేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేదు. అప్పులెలా చెల్లించాలన్న ఒత్తిడి తట్టుకోలేక కుటుంబసభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మృతికి కారణమైన వారి వేధింపులతో పాటు, కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీకి సూసైడ్ నోట్ రాశాడు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!