ఉత్తరాంధ్ర మాల మహానాడు అధ్యక్షుడు గొల్ల ఈశ్వరరావు.
వేపాడ,ఏప్రిల్,3:- మండల పరిషత్ అధికారులు ఎవరి మెప్పు పొందాలని దళిత మహిళను వాలంటీరును విధుల నుండి తొలగించారని ఉత్తరాంధ్ర మాల మహానాడు అధ్యక్షుడు గొల్ల ఈశ్వరరావు ప్రశ్నించారు.సోమవారం మండల కేంద్రంమైన వ్యాపాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని కొమ్మపల్లి జంక్షన్ వద్ద గల ఆర్ ఎం బి స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటును గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ నౌడు అరుణ సర్పంచ్ భర్త నవుడు శ్రీను, జూరెడ్డి శ్రీను ఆయన భార్య జూరెడ్డి సత్యవతి (వాలంటీర్ ) తదితరులు విగ్రహ ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు నిర్వాహకులపై దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థలో వాలంటీర్ గా విధులు నిర్వర్తిస్తున్న జో రెడ్డి సత్యవతి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని నేల కూల్చేందుకు ప్రయత్నం చేయడంతో పాటు నానా దుర్భాషలు తిడుతూ అవమానపరిచారని ఈ విషయమై వల్లంపూడి పోలీస్ స్టేషన్ లో ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయిన విషయం తెలిపారు.వాలంటీరై ఉండి భారత రాజ్యాంగ నిర్మాతను అవమానపరిచిన జూరెడ్డి సత్యవతిని నేటి వరకు అధికారులు విధుల నుండి తొలగించకపోగా ఆమెపై ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం దౌర్భాగ్యం అన్నారు.ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారంవిధులు నిర్వహిస్తూ,సంక్షేమ పథకాలనుఅర్హులకు అందజేస్తున్న ఎస్సీ మహిళ అయిన కణితి శైలజను రాజకీయంగా తొలగించడం అన్యాయం అన్నారు.ఓ పక్క వైఎస్ఆర్సిపి అధినేతజగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పెద్ద పీట వేయడంతోపాటు,రాజధాని అమరావతిలో 125 అడుగుల ఎత్తైన భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగా,అదే పార్టీకి చెందిన వేపాడ మండల నాయకులు ఆర్.అండ్.బి స్థలంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అవమానంగా భావించి దానిని అడ్డుకోవడం తీవ్ర అన్యాయమన్నారు.పార్టీ అధినేతలు రాజ్యాంగ నిర్మాతను అవమానకరమైన పదజాలంతో దూషించిన వారిపైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటును అడ్డుకున్న వారిపైన వైఎస్ఆర్సిపి నేతలు తగు విధమైన చర్యలు చేపట్టి, దళిత వర్గాలకు దైవంగా భావించబడే భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి జరిగిన అవమానాల నివారణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.ముఖ్యంగావిధుల నుండి తొలగింపబడ్డఎస్సీ మహిళా వాలంటీర్ శైలజను తక్షణమే వీధిలోకి తీసుకునేలా చర్యలు చేపట్టాలని లేకుంటే మాల మహానాడు ఆధ్వర్యంలోఉద్యమించడం తప్పదని గొల్ల ఈశ్వరరావు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఉత్తరాంధ్ర మాల మహానాడు ప్రధాన కార్యదర్శి దేందేటి దేముడు,సభ్యులు బొత్స దేముడు,జిల్లా కార్యదర్శి కణితి విజయ్,జిల్లా ఉపాధ్యక్షులు జిమ్ వెంకట్రావు, ఉత్తరాంధ్ర మాల మహానాడు సభ్యుడు రిట్టపల్లి పెంటయ్యతదితరులు పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!