ఓ వ్యవస్థ ప్రతిష్ఠను పెంచాలన్నా.. దిగజార్చాలన్నా.. అందులో పని చేసే వ్యక్తులపైనే ఆధారపడి ఉంటుంది. పోలీసులు తీసుకుంటున్న కొన్ని విప్లవాత్మక నిర్ణయాల వల్ల క్రమేణా ప్రజల్లో ఆ భావన తొలుగుతోంది. సిటిజన్ చార్టర్, నేను సైతం, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలు ప్రవేశపెట్టి ప్రజలకు చేరువవుతున్న పోలీసుల పట్ల గౌరవం కూడా పెరుగుతోంది. సంస్థలో భాగమై ఉన్న ఒకరిద్దరి వల్ల ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు అప్పుడప్పుడూ కొన్ని ఇబ్బందులు వస్తున్నా.. వెంటనే స్పందిస్తున్న పోలీస్ బాస్‌లు సత్వర చర్యలు తీసుకుని ప్రజలకు సరైన సంకేతాలు పంపిస్తున్నారు. వీటికి తోడు కొంతమంది సిబ్బంది తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే.. మానవత్వాన్ని చాటి వారు కూడా మనలో ఒకరేనన్న భావాన్ని పెంపొందించడమే కాకుండా ఎందరికో మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. హోంగార్డులు, ఎస్సై, ఇన్స్పెక్టర్లు అత్యంత బిజీగా ఉండి విధి నిర్వహిస్తూనే ప్రజలకు సహకారం అందించి మానవత్వాన్ని చాటుకున్న ఘటన ఇదే.పనిచేసుకొని బతికేందుకు చేతగాక, ఆకలితో అలమటిస్తున్న ఆ తల్లిని పోలీసులు చేరదీశారు. ఆమెకు కడుపు నిండా అన్నం పెట్టి ఆదరించారు. ఆ తల్లి దీనగాథను విన్న ఎస్సై మానవీయంగా స్పందించి ఆమెకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. చల్లపల్లి ఎస్ ఐ డి.సందీప్ తెలిపిన వివరాల ప్రకారం చల్లపల్లి బస్టాండ్ వద్దనున్న ఒక షాపు ముందు ఒక వృద్ధురాలు పడుకుని ఉండటం గమనించిన కానిస్టేబుల్ అంకబాబు ఆ విషయాన్ని ఎస్ ఐ సందీప్ దృష్టికి తీసుకునివెళ్లగా, ఆమెను వెంటనే పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకునిరమ్మని తెలిపారు. ఎస్ ఐ సందీప్ అదేశాలమేరకు అక్కడ కొంతమంది సహాయంతో వృద్ధురాలిని పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకుని వెళ్లారు. అనంతరం ఎస్ ఐ ఆమె వివరాలను తెలుసుకుని, ఆమె ఆకలితో అలమటిస్తుందని తెలుసుకున్న ఎస్ ఐ ఆమెకు కడుపునిండా ఆహారం పెట్టారు. ఆమెను చల్లపల్లి లోని సీయోను వృద్ధాశ్రమంలో చేర్చి, ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. రేపు కుటుంబసభ్యులు వచ్చిన తర్వాత వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, వృద్ధురాలిని ఆమె ఇంటికి పంపుతామని తెలిపారు. ఈ సందర్భంగా వృద్ధురాలి గురించి సమాచారం తెలిపి, ఆమెను స్టేషన్ వద్దకు తీసుకునివచ్చిన కానిస్టేబుల్ అంకబాబు ని, ఆమెకు వృద్ధాశ్రమంలో ఆశ్రయం ఇచ్చిన సీయోను వృద్ధాశ్రమం నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!