విజయవాడ, సెప్టెంబర్ 16: బుడమేరు వరద ఉధృతికి ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడ్డారని మంత్రి నారాయణ (Minister Narayana) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతం మునిగిపోయిందని వైసీపీ (YSRCP) అసత్య ప్రచారాలు చేసిందని.. రాజధాని పరిసర ప్రాంతాలకి ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి ఇలాంటి ఇబ్బందులు తలేత్తకుండా మూడు వాగులని స్టోరేజ్ కెపాసిటీ పెంచుతున్నామని.. అందులో భాగంగా కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్‌ను డిజైన్ చేస్తున్నామని తెలిపారు.వచ్చే రెండు నెలలో టెండర్లు వేసి పనులు ప్రారంభించి వచ్చే వర్షా కాలం లోపు పూర్తి చేస్తామని తెలిపారు. కెనాల్స్ కాకుండా ఇంకా రిజర్వాయర్స్ను కూడా డిజైన్ చేయటం జరుగుతుందన్నారు. ఎక్కువ వరద వస్తే రిజర్వాయర్స్‌కు పంపించటం జరుగుతుందన్నారు. ఇలాంటివి చేయటం వల్ల అమరావతి రాజధానికి ఎలాంటి ముప్పు ఉండదన్నారు. కరకట్టను నాలుగులైన్లతో గతంలో డిజైన్ చేశామన్నారు. ఐకాన్ బిల్డింగ్స్‌కు ఎలాంటి ఇబ్బందులు లేవని ఐఐటీ నిపుణులు నివేదిక ఇచ్చారన్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!