గంజాయి మత్తులో నిర్వీర్యం అవుతున్న యువత
జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం జగన్
యువగళం పాదయాత్ర ప్రారంభంలో లోకేశ్ విమర్శలు
శ్రీకాళహస్తి,ఫిబ్రవరి 21 (ఆంధ్రపత్రిక): రాష్ట్రంలో యువత ఉపాధి లేక పెడదారి పడుతున్నారని, గంజాయ్ మత్తులో యువత నిర్వీర్యమవుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగం పెరిగిపోయిందని, జ్యాబ్ క్యాలెండర్ పేరుతో వైసీపీ ప్రభుత్వం యువతను మోసం చేసిందని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని, మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని స్పస్టం చేశారు. చంద్రబాబు హయాంలో శాంతి భద్రతలు పటిష్ఠంగా ఉన్నాయని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని మండిపడ్డారు.నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ను 23వ రోజు మంగళవారం శ్రీకాళహస్తి పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఏర్పాటు చేసిన క్యాంప్ సైట్ నుంచి ప్రారంభించారు. క్యాంప్ సైట్ వద్ద ముస్లిం సోదరులతో లోకేశ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారని విమర్శించారు. టీడీపీ హయాంలోనే ముస్లిం మైనార్టీల సంక్షేమం జరిగిందని, చంద్రాబునాయుడు ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు.టీడీపీ అధికారంలోకి వస్తే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఆదుకుంటామని, ముస్లిం మైనార్టీలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు కల్పిస్తామని నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇండస్టీ క్లస్టర్లలో ముస్లింలకు ప్రత్యేక కేటాయింపులు జరుపుతామన్నారు. టీడీపీ హాయాంలో శ్రీకాళహస్తి పరిసరాల్లో పరిశ్రమలు తీసుకొచ్చామని, ఇప్పుడు ఆ పరిశ్రమల్లో పది వేల మంది వరకు పని చేస్తున్నారన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ప్రస్తుతానికి లక్ష మంది పని చేస్తూ ఉండేవాళ్ళని అన్నారు. గన్నవరంలో టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి చేసి తిరిగి తమ నేతలపైనే కేసులు పెట్టారని, ఈ రోజు శాంతి భద్రతల పరిస్థితి ఇలా ఉందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల కోసం టిడ్కో ఇళ్లు టీడీపీ నిర్మిస్తే లబ్దిదారులకు వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఇళ్లను పంపిణీ చేస్తామన్నారు. పేదలకు పక్కా గృహాలు నిర్మించి పంపిణీ చేస్తామన్నారు. విభజన హావిూలపై టీడీపీయే కేంద్రాన్ని నిలదీస్తోందన్నారు. రంజాన్ తోఫాను వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందని, ఆరు లక్షల ఫించన్లు తొలగించిందని నారా లోకేష్ విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వస్తే ముస్లిం మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగు పరుస్తామన్నారు. బీడీ కార్మికుల సంక్షేమానికి భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామన్నారు. ముస్లింల కొసం ఎన్నో చేశామని.. ఇంకా చేస్తామని చెప్పారు. ఇక జగన్ పని అయిపోయిందని.. ఈసారి అధికారంలోకి వచ్చేది చంద్రబాబేనని ఆశాభావం వ్యక్తం చేశారు. సంక్షేమం.. అభివృధ్దే ధ్యేయంగా పని చేస్తామని, రేణిగుంట మండలంలో ముస్లిం మహిళలకు రెసిడెన్షియల్ కళాశాల ఎర్పాటు చేస్తామని నారా లోకష్ స్పష్టం చేశారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!