34 ఏళ్ల రాజకీయ జీవితంలో తనపై ఎన్నోసార్లు దాడులు జరిగాయని.. అయినా సరే వెనకడుగు వేయకుండా తన బాధ్యతలు నిర్వహిస్తున్నానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. అనేక గాయాల నొప్పులు పునరావృతమవుతన్నప్పటికీ.. తన పనిలో ఇతరులు జోక్యం చేసుకోవడానికి ఎప్పుడూ అనుమతించనంటూ దీదీ స్పష్టంచేశారు. టీవీ9 బంగ్లా నక్షత్ర సమ్మాన్ కార్యక్రమం కోల్‌కతా వేదికగా బుధవారం వేడుకగా జరిగింది.
34 ఏళ్ల రాజకీయ జీవితంలో తనపై ఎన్నోసార్లు దాడులు జరిగాయని.. అయినా సరే వెనకడుగు వేయకుండా తన బాధ్యతలు నిర్వహిస్తున్నానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. అనేక గాయాల నొప్పులు పునరావృతమవుతన్నప్పటికీ.. తన పనిలో ఇతరులు జోక్యం చేసుకోవడానికి ఎప్పుడూ అనుమతించనంటూ దీదీ స్పష్టంచేశారు. టీవీ9 బంగ్లా నక్షత్ర సమ్మాన్ కార్యక్రమం కోల్‌కతా వేదికగా బుధవారం వేడుకగా జరిగింది. ‘TV9 బంగ్లా నక్షత్ర సమ్మాన్’ వేడుకలో భాగంగా మమతా బెనర్జీ.. TV9 MD and CEO బరున్ దాస్‌తో వర్చువల్‌గా మాట్లాడారు. ‘TV9 బంగ్లా నక్షత్ర సమ్మాన్’ అవార్డు పొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అవార్డు గ్రహీతలందరూ రాష్ట్రాన్ని గర్వించేలా చేశారని పేర్కొన్నారు. TV9 MD and CEO బరున్దాస్తో టెలిఫోన్ సంభాషణ ద్వారా మాట్లాడిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. 34 ఏళ్ల రాజకీయ జీవితం, పోరాటాలు, అనారోగ్య సమస్యలు, వ్యక్తిగత విషయాలతోపాటు అనేక అంశాలపై మాట్లాడారు. 34 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నోసార్లు తనపై దాడులు జరిగాయని.. ఎన్నో శారీరక గాయాలను తట్టుకున్నానని అని ఆమె చెప్పారు. ఈ గాయాలు, నొప్పులు తరచూ వేధిస్తున్నాయని.. కానీ తన పనిలో వాటి జోక్యాన్ని ఎప్పుడూ రానివ్వను.. అంటూ పేర్కొన్నారు. అనారోగ్య సమస్యల వల్ల TV9 బంగ్లా నక్షత్ర సమ్మాన్ వేడుకకు హాజరుకాలేకపోయానని తెలిపారు. బరున్ దాస్ అరోగ్య పరిస్థితి గురించి దీదీని ప్రశ్నించగా.. ప్రస్తుతం జ్వరం తగ్గిందని.. వైద్యలుు ఇప్పుడు iv (ఇంట్రావీనస్ ఇంజెక్షన్లు) ఇస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా బరున్ దాస్‌తో దీదీ పాతగాయాల నేపథ్యాలను వివరించారు. హెలికాప్టర్ నుంచి దూకినప్పుడుతనకు ఘోరమైన గాయం తగిలిందని, అంతకు ముందు నందిగ్రామ్‌లో ఇదే పాయింట్లో గాయాలయ్యాయని.. స్పెయిన్ పర్యటన సందర్భంగా బార్సిలోనాలోని ఓ స్టేడియానికి వెళ్లినప్పుడు స్కిడ్ అయ్యానని.. ఇదంతా అనుకోకుండా జరిగిందని తెలిపారు. తాను తీవ్రమైన నొప్పిని తట్టుకోగలిగానని.. తన పరిస్థితిని ఎవరికీ చెప్పలేదన్నారు. అవి అంతర్జాతీయ కార్యక్రమాలు కావున.. సమయానికి వాటికి హాజరయ్యానన్నారు. కానీ.. టీవీ9 అభినందన కార్యక్రమానికి హాజరు కాలేకపోయానంటూ బరున్ దాస్‌కు వివరించారు.
ఈ సందర్భంగా బరున్ దాస్ దీదీతో మాట్లాడుతూ.. మీరు ఎవరి మాట వినరని మాకు చెప్పారు..? నిజమేనా అంటూ ప్రశనించారు.. అయితే, తాను ఇతరుల మాటలు కూడా వింటానని.. నేను ఏ వైద్య సలహాను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయనని తెలిపారు. గతంలో తగిలిన దెబ్బలతో.. తాను చాలా ఇబ్బందులు పడుతున్నానని.. ఇది చాలా మందికి తెలియదంటూ దీదీ బదులిచ్చారు. తన కష్టాన్ని అర్థం చేసుకోవడానికి ఎవరినీ అనుమతించనని.. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తానని.. వాకింగ్, ప్రాణాయామం కూడా చేస్తానంటూ వివరించారు. ఇప్పుడు బాగానే ఉన్నాననని.. వైద్యులు చికిత్స తీసుకోవాలని చెప్పారని.. సుమారు 4-5 రోజులు పడుతుందన్నారు. అయితే, ఎన్ని కష్టాలు, ఆరోగ్య సమస్యలు ఉన్నా.. పశ్చిమ బెంగాల్‌కు సేవ చేయడంలో ఆమె అంకితభావాన్ని మమతా బెనర్జీ నొక్కి చెప్పారు.
అనారోగ్య పరిస్థితుల కారణంగా.. ఈసారి వర్చువల్‌గా ఫోన్లో మాత్రమే మాట్లాడగలిగాను.. వేరే సందర్భంలో టీవీ9 కార్యక్రమాలకు తప్పకుండా హాజరవుతాను.. అనారోగ్య పరిస్థితులతో కార్యక్రమాన్ని రద్దు చేసుకోవడం ఇదే మొదటిసారి.. అంటూ బరున్ దాస్‌కు మమతా వివరించారు. బరున్ దాస్ బదులిస్తూ.. కార్యాలయం లేఖ అందిందని.. మళ్లీ మరో కార్యక్రమం నిర్వహిస్తామని.. అప్పుడు హాజరుకావాలని.. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలంటూ.. బరున్ దాస్ దీదీకి ధన్యవాదాలు తెలిపారు.
ప్రముఖులకు సన్మానం..
TV9 బంగ్లా నక్షత్ర సమ్మాన్ ఈవెంట్లో విభిన్న రంగాలలో కృషి చేస్తున్న పలువురు ప్రముఖలకు అవార్డులు అందజేశారు. చిత్రకారుడు జోగెన్ చౌదరి, రచయిత శీర్షేందు ముఖోపాధ్యాయ, కవి జాయ్ గోస్వామి, శాస్త్రీయ గాయకుడు పండిట్ అజయ్ చక్రవర్తి, వాగ్గేయకారులు జగన్నాథ్ బసు, ఊర్మిమలా బసు, ఇంద్రజాలికుడు పిసి సోర్కార్ జూనియర్, శాస్త్రీయ గాయకుడు పీటీ అజయ్ చక్రవర్తి, నాసా సైంటిస్ట్ అమితవ ఘోష్ వంటి ప్రముఖులు అవార్డులు అందజేశారు. ఆయా రంగాలలో వారి సహకారం, రాష్ట్రం, దేశం గర్వించేలా చేయడం కోసం వీరంతా కృషి చేస్తున్నారని టీవీ9 ఎండీ, సీఈఓ బరున్ దాస్ పేర్కొన్నారు.