ఈ శివుడిని ఏ ఆలయంలో లేదా ఇంట్లో పూజించకూడదు.
ఓ పూజారి స్వయంగా ఇంటికి తీసుకెళ్లినా కూడా పూజించలేకపోయాడు. అటు తర్వాత ఆ శివలింగాన్ని ఆలయంలో కూడా ఉంచి పూజించలేకపోతున్నారు. ఏంటి ఈ రహస్యం! అది మాత్రం ఎవరూ చెప్పడం లేదు.
ఆ శివలింగం.. తెల్లటిది. పాలరాతి శిల్పంలా తెల్లగా మెరిసిపోతున్న ఈ శివలింగం ఇద్దరు చిన్నారులు చెరువులో స్నానం చేస్తుండగా వారి చేతుల్లోకి వచ్చింది. ‘చైత్ర’ మాసంలో దర్శనమిచ్చిన ఈ తెల్లని శివుడిని చూసేందుకు ఇప్పుడు జనాలు బారులు తీరుతున్నారు.
అయితే, ఈ శివుడిని ఆ ప్రాంతంలోని ఎవరి ఇంట్లో లేదా గుడిలో ఉంచకూడదు. సరస్సు ముందు మాత్రమే తెల్లటి శివలింగాన్ని ఉంచాలి. తెల్ల శివ లింగానికి శాశ్వత ఆశ్రయం కల్పించేందుకు ఆ స్థలంలో ఆలయాన్ని నిర్మించాలని స్థానికులు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని గోబర్ దంగా ప్రాంతంలో చోటు చేసుకుంది.
స్థానిక సమాచారం ప్రకారం గోబర్‌దంగాలోని కంకణ చెరువులో ఇద్దరు చిన్నారులు స్నానం కోసం వెళ్లారు. వారు స్నానం చేస్తుండగా ఈ శివలింగం పైకి వచ్చింది. నల్లరాతి శివలింగం సాధారణంగా కనిపిస్తే, తెల్లని శివలింగం ఎక్కడా కనిపించదు. స్థానిక పూజారి దీనిని పూజ కోసం తీసుకెళ్లారు, కానీ రెండు రోజుల్లో శివలింగాన్ని తిరిగి చెరువుకు తీసుకువచ్చారు. నిర్దిష్టమైన కారణాలేవీ చెప్పనప్పటికీ ఈ శివుడి విగ్రహాన్ని పూజించడం తనకు సాధ్యం కాదని ఆయన తెలిపారు.
తరువాత, ఈ తెల్లని శివలింగాన్ని ఆ ప్రాంతంలోని ఆలయంలో ప్రతిష్టించారు. నాలుగు రోజులు అక్కడే ఉండి ఈ శివలింగాన్ని పూజించడం తనకు అసాధ్యమని ఆలయ పూజారి తెలిపారు. ఆ తర్వాత, తెల్లటి శివలింగం మళ్లీ చెరువు వద్దకు తిరిగి వచ్చింది. ఆ తరువాత, స్థానికు ఆలయ పూజారులు, ఊరి పెద్దలు అందరూ కలిసి ఈ శివలింగాన్ని చెరువు వద్దే స్థాపించాలని నిర్ణయించుకున్నారు.
మర్రిచెట్టు కింద మహాదేవుని లింగాన్ని ప్రతిష్టించారు. స్థానిక నివాసి నారాయణ్ సాధు మాట్లాడుతూ, “ఏడు మంది ఇంటికి తీసుకెళ్లినప్పటికీ, శివుడిని ఉంచడం సాధ్యం కాలేదు. శివుడు ఈ చెరువు తప్ప మరెక్కడా ఉండడు. తెల్లటి శివుడిని ఇక్కడే ప్రతిష్టించాలని ఆ ప్రాంతంలోని అందరూ నిర్ణయించారు. అందుకోసం విరాళాలు కూడా సేకరిస్తున్నారని తెలిపారు.
మరోవైపు ఈ వార్త చుట్టుపక్కల వారికి తెలియడంతో తెల్లటి శివలింగాన్ని దర్శించుకోవడానికి స్థానికులతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆలయ నిర్మాణానికి అవసరమైన విరాళాలు కూడా అందిస్తున్నారు. స్థానిక అసిమ్ సర్కార్ మాట్లాడుతూ “మహాదేవ్ (శివుడు) కోసం ఇక్కడ ఆలయం నిర్మించబడుతుంది.
నీల్ పూజ రోజున ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ శివుని దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుండి ప్రజలు వస్తుంటారు. మొత్తానికి గోబర్దంగ ప్రాంతంలోని తెల్లని శివలింగం బయటపడటంతో పండగ వాతావరణం నెలకొంది’ అంటూ తెలిపారు.