ఘనంగా మొగల్తూరులో ప్రారంభమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవములు
మొగల్తూరు ఏప్రిల్ 15 (ఆంధ్ర పత్రిక) పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం మొగల్తూరు గ్రామంలో శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నందు వార్షిక కళ్యాణ మహోత్సవములు శనివారం ఉదయం ఆలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి ఉదయం భక్తులు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి శనివారం రాత్రి 7 గంటలకు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నిర్వహణ కమిటీ సభ్యులు ఏర్పాట్లు శరవేగముగా చేస్తున్నారు.