అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు
రావికమతం ఫిబ్రవరి 9(ఆంధ్రపత్రిక): మండలంలో తట్టబంద పంచాయతీ ఎల్ ఎన్ పురం గ్రామంలో గ్రామదేవత భూలోకమ్మ తల్లి పండుగను గురువారం ఘనంగా నర్వహించారు.ఉదయం నుంచే అమ్మవారికి పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.గ్రామ సర్పంచ్ గోకివాడ రమణ ఆధ్వర్యంలో భారీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు.ఈ అమ్మవారి పండుగకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు బత్తుల తాతయ్యబాబు, గునూరు మల్లునాయుడు తో పాటు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామానికి వచ్చిన గంటాకుమండల టీడీపీ నాయకులు కొండనాయుడు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు భారీ స్వాగతం పలికారు.