- ప్రజల ఆకాంక్షమేరకే 3 రాజధానులు
- మూడు రాజధానుల అజెండాతోనే ఎన్నికలకు వెళ్తాం..
- ఏపీ పరిశ్రమల శాఖా మంత్రి అమర్నాథ్ రెడ్డి
అమరావతి,అక్టోబర్ 10 (ఆంధ్రపత్రిక): జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ గతంలో అమ రావతిపై చేసిన విమర్శలను ప్రజలు మర్చిపోలేదని, ప్రజల ఆకాంక్షమేరకే 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని ఏపీ మంత్రి అమర్నాథ్ తెలిపారు.మూడు రాజధానులకు మద్దతుగా ఈనెల 15న విశాఖలో గర్జన నిర్వహించనున్నట్లు చెప్పారు. మూడు రాజధానుల అజెండాతోనే ఎన్నికలకు వెళ్తా మని అన్నారు. మరోవైపు ఫిబ్రవరిలో విశాఖ నగరంలో పారిశ్రామిక సదస్సు నిర్వహిం చాలని సీఎం జగన్ ఆదేశించినట్లు మంత్రి వెల్లడిరచారు. పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పనపై అధికారులు, మంత్రులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అనంతరం సమా వేశం వివరాలను మంత్రి అమర్నాథ్ మీడియాకు వెల్లడిరచారు. పరిశ్రమలకు చేయూత నిచ్చేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. ఎంఎస్ ఎంఈలకు ఇన్సెంటివ్‌లు ఇవ్వాలని, ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారన్నారు. అనుమతుల్లో జాప్యం లేకుండా త్వరగా క్లియరెన్స్ ఇచ్చేలా చూడాలని సీఎం అదేశించినట్లు చెప్పారు.
2030 చివరినాటికి రామాయపట్నం పూర్తవ్వాలి: సీఎం
పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపైనా జగన్ సమీక్ష నిర్వహించారు. రామాయపట్నంలో 2024 మార్చి నాటికి పనులు పూర్తవుతాయని అధికారులు సీఎంకు వివరించారు. 2030 డిసెంబరు కల్లా పనులు పూర్తయ్యేలా చూడాలని సీఏం ఆదేశించారు. మచిలీపట్నం పోర్టు పనులు వచ్చే నెల నుంచి, భావనపాడు పోర్టు పనులను డిసెంబరులో ప్రారంభించ నున్నట్లు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జువ్వలదిన్నె, నిజాంపట్నం, బందరు, ఉప్పాడ హార్బర్ పనులపైనా సీఎం ఆరా తీశారు. వీటిని 2023 జూన్‌కల్లా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.