న్యూఢల్లీి,అక్టోబర్ 28 (ఆంధ్రపత్రిక): శిలాజ ఇంధనాల పెరుగుదలతో ప్రపంచానికి పెనుముప్పు తప్పదని ఓ నివేదిక తేల్చింది. బొగ్గు, చమురు, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాలను విపరీతంగా వాడుతుండటంతో.. గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుందని.. దీంతో లక్షలాది మందిప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంది. భవిష్యత్తులో మరింత తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఆ నివేదిక హెచ్చరించింది. ఒక్క భారత్‌లోనే 2 నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారని ’ద లాన్సెట్ కౌంట్‌డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ చేంజ్’ అనే నివేదిక వెల్లడిరచింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాతావరణ సంస్థ వంటి 50 సంస్థలకు చెందిన 99 మంది నిపుణులు ఈ నివేదనకు రూపొందించారు. ఈ శతాబ్దం చివరి నాటికి గ్లోబల్ వార్మింగ్ 2.7 డిగ్రీల సెల్సియస్ పెరగనుందని నివేదిక తెలిపింది. ఈ శిలాజ ఇంధనాల వాడకం వల్ల ఏర్పడే కాలుష్యం కారణంగా.. గతేడాదిలో భారత్‌లో 3,30,000 మంది ప్రాణాలు కోల్పోయారని ఆ నివేదిక వెల్లడిరచింది. అంటే ప్రతి 2 నిమిషాలకు 1.2 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. గతేడాదిలోనే చైనాలో 3,80,000 మరణాలు సంభవించగా.. ఐరోపా దేశాల్లో 1,17,000 మంది, అమెరికాలో 32 వేల మంది మరణించారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించడంతో పాటు ఆరోగ్య కార్యక్రమాలపై మరింత దృష్టి పెట్టాలని ప్రపంచ దేశాలకు సూచించారు. శిలాజ ఇంధనాల పెరుగుదలతో ఆహార భద్రత, అంటు వ్యాధుల వ్యాప్తి, అధిక ఉష్ణోగ్రతలు, విద్యుత్ సంక్షోభం, గాలి కాలుష్యం వంటివి పెరుగుతాయని హెచ్చరించింది. మరణాల రేటు కూడా గణనీయంగా పెరుగుతుందని నిపుణులు హెచ్చ రించారు. శిలాజ ఇంధనాలకు రాయితీలు ఇవ్వడం తగ్గించాలని సూచించారు. వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని, లేకపోతే వినాశనం తప్పదని చెప్పారు.మరోవైపు ఢల్లీిలో ఎయిర్ పొల్యూషన్ మరోసారి పెరిగింది. పూర్ కేటగిరి నుంచి వెరీ పూర్ కేటగిరికి చేరింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 354కు చేరింది. దీంతో గాలిలో నాణ్యత తగ్గింది. దీపావళి తరువాత నుంచి ఎయిర్ క్వాలిటి తగ్గిందని అధికారులు చెబుతున్నారు. సోమవారం రాత్రి 312 ఉండగా మంగళవారానికి 302కి చేరి మెరుగు పడిరది. అయితే నిన్న మరోసారి ఎయిర్ పొల్యూషన్ పెరిగింది. పొల్యూషన్ కారకాలు వాతావరణంలో పెరిగి పోయాయని వాతావరణ శాఖ అధికారులు అన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!