మొగల్తూరు నవంబర్ 27 (గోపరాజు సూర్యనారాయణ రావు) ఆంధ్రపత్రిక :
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం గొల్లగూడెం ప్రాథమిక పాఠశాల నందు ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న దిగమర్తి శ్రీనివాస్ సోమవారం ఉదయం 8 గంటలకు నరసాపురం జానకి హాస్పిటల్ నందు గుండెపోటుతో మృతి చెందారు. గొల్లగూడెం గ్రామానికి చెందిన గ్రామ పెద్ద, మరియు మొగల్తూరు మండల వైస్ ఎంపీపీ కైలా సుబ్బారావు, మొగల్తూరు మండల విద్యాశాఖ అధికారి 2 ఉన్నమట్ల శామ్యూల్ జాన్, మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు.