ఆశించిన స్థాయిలో ఆడని సినిమా
ఎన్నో వివాదాల నడుమ సంక్రాంతి కానుకగా రిలీజైన ’వారసుడు’ తమిళంలో సూపర్ హిట్టయి తెలుగులో బ్రేక్ ఈవెన్ సాధించకుండానే థియేటర్లలో నుండి వెళ్లిపోయింది. ’తుపాకీ’ తర్వాత అంచెలంచెలుగా మార్కెట్ విస్తరించుకుంటున్న విజయ్‌కు గత రెండు మూడు సినిమాలు తెలుగులో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయాయి. అయితే వారసుడు మూవీకి విజయ్‌కు తెలుగులో ఉన్న మార్కెట్ కంటే ఎక్కువే బిజినెస్ జరిగింది. దాంతో బ్రేక్ ఈవెన్ దగ్గరి వరకు వచ్చి ఆగిపోయింది. పైగా వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి మాస్ కమర్షియల్ సినిమాలు పోటీగా ఉండటం.. ప్రేక్షకులందరూ వాటికే ఓటేయడంతో తెలుగులో యావరేజ్ హిట్‌తో సరిపెట్టుకుంది. వంశీపైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ సంస్థ దక్కించుకుంది. కాగా ఫిబ్రవరి 22నుండి ఈ సినిమాను స్టీమ్రింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. విజయ్‌కు జోడీగా రష్మిక మందన్న నటించింది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ అత్యంత భారీ బ్జడెట్‌తో ఈ సినిమాను నిర్మించాడు. నిజానికి ఈ సినిమా జనవరి 11నే తెలుగులో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల మూడు రోజులు వెనక్కి జరిగింది. అయితే ముందచ్చుంటే మాత్రం ఈ సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది. ఇక ఇప్పటి వరకు టోటల్‌గా ఈ మూవీ రూ.200 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!