పాల్గొన్న ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్..
భీమవరం ఫిబ్రవరి 5 (ఆంధ్ర పత్రిక )
పట్టణంలోని గునుపూడి లో ఆదివారం ఉదయం బ్రహ్మశ్రీ ఘంటసాల సోమేశ్వర శర్మ, గాయత్రి దంపతులు, వారి కుమారులు మణిశర్మ, దీక్షిత్ శర్మల ఆధ్వర్యంలో శ్రీ దాసాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ దాసాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో తాను పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అని అన్నారు. గునుపూడి అంటేనే రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక క్షేత్రాలకు నిలయమని అన్నారు. పంచారామ క్షేత్రాలలో ఒకటైన శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి ఆలయంతో పాటుగా అన్నపూర్ణ దేవి ఆలయం, విద్యా గణపతి, సాయిబాబా, రాజ్యలక్ష్మి, ఆదిలక్ష్మి పోలేరమ్మ అమ్మ వార్ల ఆలయాలు ఉన్నాయని, ఇకనుండి శ్రీ దాసాంజనేయ స్వామి వారి దర్శనము కూడా భక్తులకు కలగడం ప్రజల అదృష్టమని అన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి భావనతో ఉన్నప్పుడే సమాజంలో శాంతి నెలకొంటుందని పేర్కొన్నారు. స్వామి వారి విగ్రహం ఏర్పాటుకు, ప్రతిష్టకు ఘంటసాల సోమేశ్వర శర్మ కుటుంబ సభ్యులు ముందుకు రావడం వారు పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యఫలమని వెల్లడించారు. బ్రహ్మశ్రీ చెరుకూరి రవీంద్ర శర్మ ఆధ్వర్యంలో ఈ విగ్రహ ప్రతిష్ట జరగగా, ఉదయం 8 గంటల నుండి ప్రత్యేక పూజలు హోమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయ కమిటీ చైర్మన్ కోడె విజయలక్ష్మి, మావుళ్ళమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్ మానేపల్లి నాగన్న బాబు, కోడె యుగంధర్, ఆకొండి రాంబాబు, రెడ్డి సత్తిబాబు,కోమటి రాంబాబు, కోటిపల్లి నాగు, మోటుపల్లి విశ్వేశ్వరరావు, కొల్లా చిన్న, చెన్నం శెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు.