శ్రీశైలం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం వెబ్సైట్ మొరాయించింది. ఆదివారం సాయంత్రం నుంచి ఆలయ వెబ్సైట్ పనిచేయడం లేదు. సాంకేతిక సమస్యలతో ఆన్లైన్ టికెట్ల జారీ నిలిచిపోయింది.
దీంతో ఆలయ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. మాన్యువల్ దర్శనం టికెట్లను జారీ చేశారు. సాంకేతిక సమస్యలతో ఆర్జిత సేవా టికెట్లు అందుబాటులోకి రాలేదు. దీంతో భక్తులు ఆర్జిత సేవలు, అభిషేకం, కుంకుమార్చన సేవలు నిర్వహించలేకపోతున్నారు.