నవంబర్ 24 (ఆంధ్రపత్రిక): బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ’వీరసింహారెడ్డి’. శ్రుతిహాసన్ హీరోయిన్. సంక్రాంతికి రిలీజ్ అని ఇప్పటికే అనౌన్స్ చేసిన టీమ్, ప్రమోషన్స్ లో స్పీడు పెంచుతూ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్‌ను బుధవారం అనౌన్స్ చేసింది. ’గాడ్ ఆఫ్ మాసెస్ కోసం మాస్ ఆంథమ్’ రాబోతోంది అంటూ ’జై బాలయ్య’ పాటను నవంబర్ 25న విడుదల చేయబోతున్నట్టు చెప్పారు. ’రాజసం ఇంటిపేరు’ అంటూ విడుదల చేసిన పోస్టర్లో.. వైట్ అండ్ వైట్ కాస్ట్యూమ్స్‌లో ట్రాక్టర్ నడుపుతూ రాయల్ లుక్‌లో కనిపించారు బాలకృష్ణ. ’అఖండ’లో జై బాలయ్య అనే పాటను కంపోజ్ చేసిన తమన్.. ’వీరసింహారెడ్డి’ కోసం ఇదే పల్లవితో మరో మాస్ నంబర్‌ను రెడీ చేశాడు. అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యేలా ఈ పాట ఉంటుందంటున్నారు మేకర్స్. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. ఈషెడ్యూల్తో టాకీ పార్ట్ పూర్తవనుండగా త్వరలోనే ఓ పాటను విదేశాల్లో తీయనున్నారు. దునియా విజయ్, వరలక్ష్మీ శరత్‌కుమార్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. చంద్రిక రవి స్పెషల్ సాంగ్ చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!