వైకాపా ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో సారి స్పష్టం చేశారు. వైకాపా, తెదేపాకు కొమ్ముకాసేందుకు తాము సిద్ధంగా లేమని రాష్ట్రంలో మూడో ప్రత్యా మ్నాయం ఉండాలనేది తమ అభిప్రాయమని చెప్పారు.రామానుజపల్లి జీఆర్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞాపనలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అగ్రవర్ణాల ముందు చేతులు కట్టుకునే సంస్కృతికి రాయలసీమలో చరమగీతం పాడటానికి కృషి చేస్తామన్నారు. గ్రంథాలయాలకు పేరుగాంచిన రాయలసీమలో.. నేడు మద్యం ఏరులైపారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో పులివెందులలో హింస అధికమైందన్నారు. సమాజంలో మార్పుకోసం ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుంటామన్నారు. సమయం వచ్చినప్పుడు ఎన్నికల వ్యూహం చెబుతామన్న పవన్.. మరోసారి వైకాపా ప్రభుత్వం రాకూడదనేదే ప్రస్తుతం తమ వ్యూహమని స్పష్టం చేశారు. తమతో కలిసి ప్రయాణించాలనుకునే నేతలు ముందుగా జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలకు గౌరవం ఇవ్వాలన్నారు. ఒక ఎలక్షన్ కోసమైతే పార్టీలో చేరవద్దని స్పష్టం చేశారు.‘’కడప జిల్లాకు పరిశ్రమలు ఎందుకు రావడంలేదు. రాష్ట్రంలో గనులు, అటవీ సంపద దోపిడీ జరుగుతోంది. రాయలసీమ నేతల్లో కొందరు భాగా ధనవంతులు ఉన్నారు. కానీ, రాయలసీమలోని చెరువుల్లో పూడిక కూడా తీయించడంలేదు. మౌలిక వసతులు, రహ దారులపై ప్రత్యేక దృష్టి సారించాలి. సమస్యల పరిష్కారంపై పాలకులు దృష్టి సారించాలి. రాయలసీమలో దళితుల గొంతు నొక్కుతున్నారు. ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలు, వేధింపులు పెరిగాయి. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే వెనుకబడిన కులాలకు అధికారం దక్కాలి. రాయలసీమలోని అనేక ఉప కులాలకు గుర్తింపు లేదు. కులాల మధ్య ద్వేషం పెంచడం నాకిష్టం లేదు.. కానీ, కులాల మధ్య అసమానతలు ఉన్నాయి. ఇది పోవాలంటే రాయలసీమ ప్రజల్లో చైతన్యం రావాలి. మీ ఆలోచనా విధానం మారాలి’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!