ఉపనదులు ప్రాణహిత, ఇంద్రా వతి ఉప్పొంగి ప్రవహిస్తూ గోదావరిలో కలుస్తూ ఉండటంతో గోదావరి మరలా ఉధృతమై ప్రవహిస్తోంది. ధవళేశ్వరం వద్ద మంగళవారం ఉదయం 8 గంటల వరకు తగ్గిన నీటిమట్టం 13.70 అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం మళ్లీ పెరగడంతో మరలా రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. రాత్రి 11 గంటలకు నీటిమట్టం 14.15 అడుగులకు చేరుకోగా 13.36 లక్షల క్యూసెక్కులు దిగువకు ప్రవహిస్తోంది. ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 15 అడుగులకు పైగా పెరిగి 16 లక్షల క్యూసెక్కుల ప్రవాహం తరలిరావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఆరు రోజులుగా ధవళేశ్వరం వద్ద ప్రమాద
హెచ్చరికలు కొన సాగుతుండగా మంగళవారం రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించడంతో ప్లడ్ సెక్షన్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 8 గంటల వ్యవధిలోనే మరలా రెండో ప్రమాద హెచ్చరిక జారీ కావడంతో ఈఈలు, డీఈ, ఏఈలు వారికి కేటాయించిన పరిధిలో వరద పర్యవేక్షణ అధికారులుగా విధుల్లో చేరారు. ఔట్ ఫాల్స్ స్లూయిజ్‌ల వద్ద తగు రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. వరదనీటి మట్టం మరింత పెరగవచ్చనే అంచనాతో మరింత అప్రమత్తంగా ఉన్నారు. ఎగువన భద్రాచలం వద్ద తగ్గిన నీటిమట్టం ఆపై నిలకడగా కొనసాగి మంగళవారం తెల్లవారుజామున 48 అడుగులకు పెరగడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. వేగంగా పెరుగుతున్న నీటిమట్టం రాత్రి 7 గంటలకు 52.80 అడుగులకు చేరుకుంది. నీటిమట్టం 55 అడుగుల వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. కాళేశ్వరం వద్ద సోమవారం సాయంత్రానికి 9.900 విూటర్లుగా ఉన్న నీటిమట్టం మంగళవారం సాయంత్రానికి ఒకటిన్నర విూటర్ల మేర పెరిగి 11.430 విూటర్లుకు చేరుకోగా, పేరూరు వద్ద 13.920 విూటర్లుగా ఉన్న నీటిమట్టం 15.370 విూటర్లుకు చేరుకుంది. దుమ్ముగూడెం వద్ద 14.720 విూటర్లు, భద్రాచలం వద్ద 52.80 అడుగులు, కూనవరం వద్ద 21.490 విూటర్లు, కుంట వద్ద 12.650 విూటర్లు, పోలవరం వద్ద 13.380 విూటర్లు, రాజమహేంద్రవరం వద్ద 16.840 విూటర్లుగా నీటిమట్టం నమోదైంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!