ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రెండేళ్లుగా ఆందోళనలు
విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాదంతో పెద్ద ఎత్తున ఉద్య మించి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు సిద్దమైన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వ వైఖరికి, ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మరో ఉద్యమానికి తెర లేచి రెండేళ్లు అయిం ది.విశాఖ పట్టణంలో ఉక్కు పరిశ్రమ కోసం జరిగిన ఉద్య మం…. ఈ ఉద్యమాన్ని తెన్నేటి విశ్వనాథం నాయకుడై ముం దుండి నడిపించారు. తాటికొండ ఎమ్మేల్యే టి. అమృత రావు, ప్రత్తి శేషయ్య లాంటి నాయకులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో భాగంగా 32 మంది ప్రాణాలర్పించారు. విశా ఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అంటూ తెన్నేటి విశ్వనాధం నడిపి న ఉద్యమ ఫలితంగా, నాటి దేశ ప్రధాని ఇందిరా గాంధీ 1970 ఏప్రిల్ 10 విశాఖ పట్నంలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొ ల్ప నున్నట్లు పార్లమెంటు లో ప్రకటించింది. కర్మాగారం కోసం కురుపాం జమీందారులు 6000 ఎకరాలను 1970లో దానం చేసారు. 1970 జూన్ లో ఏర్పాటు చేసిన స్ఠల పరిశీలన కమిటీతో కర్మాగారపు ప్రణాళి కలు మొదల య్యాయి. 1971 జనవరి 20న ఇందిరా గాంధీ చేత కర్మాగారం యొక్క శంకు స్థాపన కార్యక్రమం జరిగింది.26వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ కర్మాగారం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి 10వేల కోట్ల రూపాయలతో 20 ఎకరాల భూమి నిచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించింది. 1977 లో నిర్మాణం మొద లైంది. 1979లో రష్యాతో ఒప్పందం కుదుర్చు కున్నారు. రూ.3897.28 కోట్ల అంచనా తో 3.4 మిలియన్ టన్నుల సామర్థ్యం గల కర్మాగార నిర్మాణం ప్రారంభించారు. కానీ నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురు కావడం, ప్రభుత్వాలు మారడం వలన ఇది పూర్తవ డానికి 20 ఏళ్లు పట్టింది. పూర్వ సంయుక్త రష్యా సహకారంతో నివేదికలో అనేక మార్పులు చేర్పులు జరిగాయి. నాటి సీఎం బ్రహ్మానంద రెడ్డి కృషికి 1980లో ఇందిరా గాంధీ చొరవ తోడై, ఫలితం గా 80 నుండి 1983 వరకు విశాఖ ఉక్కు కర్మాగారం వేగం పుంజుకుంది. రష్యాతో సాంకేతిక ఒప్పందం చేశారు. 1980 నవంబరులో దస్తూర్ కో సమగ్ర నివేదిక సమర్పిం చింది. కోక్ ఒవెన్, సెగ కొలిమి, సింటర్ ప్లాంట్ల రూప కల్పనకై పూర్వపు రష్యా దేశంతో 1981 ఫిబ్రవరిలో ఒప్పందం కుదిరింది. 1982 జనవరిలో సెగ కొలిమి నిర్మాణానికి, ఉద్యోగస్ఠుల పట్టణానికి శంకు స్థాపన జరిగింది. 1982 ఫిబ్రవరిలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ ఏర్పడిరది. 1982 ఏప్రిల్ నెలలో వైజాగ్ స్టీల్, భారతీయ ఉక్కు సంస్థ ఉండి విడివడిగా గుర్తింపు పొందినది.వైజాగ్ స్టీల్ గా ప్రసిద్దమైన విశాఖ ఉక్కు కర్మాగారం భారతదేశం లోని అత్యాధునిక మైన ప్రభుత్వరంగ ఉక్కు తయారీ దారు. ఇది, విశాఖ పట్టణం నగరానికి దాదాపు 26 కిలోమీటర్ల దూరంలో, జర్మనీ, సోవియ ట్ రష్యాల సాంకేతిక సహకారంతో నిర్మించ బడిరది. 1987 డిసెంబరు నాటికి కర్మాగారం నిర్మాణం పూర్త య్యింది. 1990 సెప్టెంబరులో ఉత్పత్తి ప్రారంభ మైంది. అప్పటికి నిర్మాణ వ్యయం రూ.9 వేల కోట్లకు చేరుకుంది. 1992 ఆగస్టు 8న అప్పటి ప్రధాని పి.వి. నరసింహా రావు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని జాతికి అంకితం చేశారు. మొదట్లో ఉక్కు ఉత్పత్తిలో దేశంలోనే మొదటగా నిలిచింది. 1994లో మొదటి సారిగా రూ.50 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. కానీ కర్మాగారం నిర్మాణం కోసం నిధులు లేక పోవడంతో ఇతర సంస్థలపై ఆధార పడటంతో 1998-2000 సంవత్సరంలో ఖాయిలా పరిశ్రమగా మిగిలింది. ఈ సందర్భంగా ఉక్కు కార్మిక సంఘాలు అనేక ఉద్యమాలు చేపట్టడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఉక్కు వడ్డీలను ఈక్విటీగా మార్చడం జరిగింది. ఆ తర్వాత ఉక్కు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంటూ ప్రపంచ శ్రేణి ఉక్కు కర్మాగారంగా నిలబడిరది. కర్మాగారం యొక్క ఉత్పత్తులు మన్నిక కలిగినవిగా దేశ విదేశాలలో పేరుగన్నవి. సంస్థ రాబడిలో 80% జపాన్, జర్మనీ, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలి యా, దక్షిణ అమెరికా దేశాలకు చేయ బడుతున్న ఎగుమతుల ద్వారానే వస్తున్నది. 33వేల ఎకరాలలో విస్తరించి ఉన్న వైజాగ్ స్టీల్, భారత దేశంలో తీర ప్రాంతంలో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారం. 3.6 ఎం. టి గా ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని 6.3ఎం. టి కి పెంచే రూ. 8,692 కోట్ల విస్తరణ ప్రాజెక్టును నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ 2009 మే 29న ప్రారంభించారు. మన్మోహన్ సింగ్ ప్రథాన మంత్రి పాలనలో దాని ఉత్పత్తి సామర్థ్యం పెంచారు. 2010 నవంబరు 10న నవరత్న హోదా పొందినది. కర్మాగారం విస్తరించి ఉన్న ప్రాంతం, భారత దేశం, ఆసియా మైనర్ లలోనే అతి పెద్దది. సంవత్సరానికి 21 మిలియన్ టన్నుల సామర్ధ్యం ఉన్నప్పటికీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముడి పదార్థాల కొరత, కొవిద్ 19 మహమ్మారి, మార్కెట్ తిరోగ మన కారణాల వల్ల 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంకు తగ్గింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు స్వంత ఇనుప ఖనిజం గనులు లేక పోవడం వల్ల ఏటా విశాఖ స్టీల్ సుమారు మూడు వేల కోట్లు ఇనుప ఖనిజం కోసం అదనంగా ఖర్చు చేస్తున్నది. టాటా స్టీల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, జిందాల్ స్టీల్, ఇతర ప్లాంట్లకు… స్వీయ ముడి సరుకు సమకూర్పు లేకుండా, నేషనల్ మినరల్ కార్పొరేషన్ నిర్వహణ లో బైలాదిలా గనులు, ఆస్ట్రియా నుండి ముడి బొగ్గు సరఫరాపై విశాఖ ప్లాంట్ ఆధార పడి ఉండడం వల్ల సమస్యలు ఎదురవు తున్నాయి. ఇలా మరో రెండేళ్ల పాటు నష్టాలు రావడం తథ్యమనే భావనతో, కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీమాంధ్ర, తెలంగాణకు చెందిన నేతలు పోరాటాలు, కొందరి ప్రాణ త్యాగంతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు సంస్థ నేడు ప్రైవేటు పరం కావడాన్ని ప్రజలు జీర్ణించు కోలేక పోతు న్నారు.వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి. ‘‘విశాఖ ఉక్కు ఆంధ్ర ప్రదేశ్ ప్రజల హక్కు’’ అనే నినాదం రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తోంది. వైజాగ్ స్టీల్ ను ప్రైవేటీకరణ చేయవద్దంటూ అధికార వైఎస్ఆర్సీపీ తో పాటు టీడీపీ, వామపక్షాలు గళమెత్తాయి. సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు), ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఎఐటియుసి), ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఐఎన్టియుసి) లతో కూడిన ఉమ్మడి కార్యాచరణ కమిటీ (జెఎసి) పేరిట ఉద్యోగులు ప్రైవేటీకరణ చర్యకు వ్యతిరేకంగా ఆందోళనను ఉధృతం చేసే కార్యాచరణ చేపట్టారు. విశాఖ స్టీలు కర్మాగారాన్ని అమ్మాలనే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను ఏడాది కాలంగా ఎదిరిస్తునే ఉన్నారు.. నిరసన గళాలు ప్రకటిస్తూనే ఉన్నారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం పేరిట అన్ని ప్రాంతాలలో అఖిల పక్ష సమావేశాలు, కోటి సంతకాల సేకరణ ఉద్యమాలు నానాటికీ ఉద్ధృతం అవుతున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారం పైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం పురుడు పోసుకుని, ఫిబ్రవరి 12వ తేదీ నాటికి రెండేళ్ళు పూర్తి అయింది.కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయం వాపసు తీసుకో వాలని, తీసుకునే వరకూ దీర్ఘకాలిక పోరాటం కొనసాగు తుందని ఆందోళన కారులు స్పష్టం చేస్తూ, ధృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.